కార్తీకమాసం ప్రారంభమైంది. కార్తీకం పరమేశ్వరుడికి.. విష్ణుమూర్తికి ఇష్టమైన నెల. కార్తీకంలో ఆకాశదీపానికి చాలా ప్రత్యేకత ఉందని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఈ నెల రోజుల పాటు సూర్యుడు అస్తమించిన తరువాత శివాలయాల్లో.. వైష్ణవాలయాల్లో ఆకాశదీపాలను వెలిగిస్తారు.
పురాణాల ప్రకారం సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడు దామోదరుడైన విష్ణుమూర్తి కోసం ఆకాశదీపాన్ని వెలిగించాలి. అందుకే కార్తీక మాసంలో సూర్యుడు అస్తమించిన తర్వాత శివాలయాల్లో, వైష్ణవాలయాల్లో ఆకాశదీపం ఏర్పాటుచేసే సంప్రదాయం ఉంది.
ఆకాశదీపాన్ని మట్టితో గానీ, లోహంతో గానీ చేసిన చిల్లులు ఉన్న ప్రమిదలో ఆవునెయ్యితో గానీ, నువ్వులనూనెతో గానీ ఆకాశదీపాన్ని వెలిగిస్తారు. ఈ దీపాన్ని ధ్వజస్తంభానికి వేలాడదీస్తారు. ‘దామోదరమావాహయామి’, ‘త్రయంబకమావాహయామి’ అని శివకేశవులను ఆహ్వానిస్తూ దీపాన్ని వెలిగిస్తారు.
హిందువులు చాలామంది నిత్యం దేవుడిని ప్రార్థిస్తారు. ఆచారం ప్రకారం .. సూర్యోదయానికి ముందు.. సూర్యాస్తమయం తరువాత దీపారాధన చేయాలి. సూర్యభగవానుడు ప్రత్యక్షదైవం. సూర్యుడు అస్తమించిన తరువాత ఇంట్లోకి ఆహ్వానిస్తూ దీపారాధన చేయడం వలన ఇంట్లోకి మహాలక్ష్మి ప్రవేశిస్తుందని పండితులు చెబుతున్నారు. . ఇలా దీపారాధన చేయడం ద్వారా లక్ష్మీ కటాక్షంతో ఆ ఇళ్లు కళకళలాడుతుందని ఆ పురాణా వచనం.
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు దీపకాంతులు హరిహరుల తేజస్సును ప్రసరింపజేస్తాయని భక్తులు విశ్వసిస్తారు. కార్తీక మాసంలో ప్రతిరోజూ గుడికి వెళ్లి ఆకాశదీపాన్ని దర్శించుకొని, దీపాలు వెలిగించిన వారికి జ్ఞాన సంపద కలుగుతుందని స్కాంద పురాణం ద్వారా తెలుస్తుంది.
శివకేశవుల తేజస్సుకు ప్రతి రూపం..
ఆకాశదీపం మరో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే శివ కేశవుల శక్తితో ఈ ఆకాశ దీపం ధ్వజస్తంభంపై నుంచి జగత్తుకు అంతా వెలుతురు ఇస్తుందనేది నమ్మకం. సమాజంలో అజ్ఞానపు చీకట్లు తొలగిస్తుందని నమ్ముతూ ఈ దీపం వెలిగిస్తారు. ఒక దీపం పెట్టి శివకేశవుల్లో ఏవరో ఒకరిని దీపంలోకి ఆహ్వానించాలి. ఇలా శివకేశవుల తేజస్సుతో ఈ దీపం జగత్తుకు వెలుగునందిస్తుంది.
సమాజంలో అజ్ఞానపు చీకట్లు తొలిపోతాయి. కాంతి వలే మనలో ఆధ్యాత్మిక జ్యోతి ప్రజ్వలనం అవుతుంది అని అర్థం. దీపానికి ఎంతో ప్రాధాన్యత ఉన్న కార్తీకమాసం ప్రారంభం కూడా ఆకాశదీపంతోనే జరుగుతుంది. ఈ దీపాన్ని చూసినా తలచుకున్నా ఎంతో మంచిదని.. మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుందని భక్తులు విశ్వాసం. అజ్ఞానపు చీకట్లు తొలిపోతాయి.
►ALSO READ | 1960లో ఏం జరిగింది.. 2026, నవంబర్ 13న ఏం జరగబోతుంది : గ్రహాల కూటమి కల్లోలం చేయబోతుందా..?
నువ్వుల నూనెతో వెలిగించే దీపం పవిత్రతకు ప్రతీకగా భావిస్తారు. దీని వెలుగు పాపాలను నాశనం చేసి, పుణ్యాన్ని ప్రసాదించే శక్తిని కలిగి ఉంటుంది. ఆకాశదీపం అంటే కేవలం ఒక సాంప్రదాయ దీపం కాదు. అది ఆత్మలకు మార్గదర్శకమయ్యే దివ్యజ్యోతి స్వరూపం. ఆకాశదీపం వెలిగించినా, దీపంలో నూనె పోసినా.. ఈ దీపాన్ని దర్శించుకుని నమస్కరించుకున్నా పుణ్యప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
పితృదేవతలకు దారి చూపే ఆకాశ దీపం..
మహాలయపక్షాల్లో భూలోకానికి వచ్చిన పితృ దేవతలు ఆకాశమార్గంలో తమలోకాలకు కార్తీకమాసం శుద్ద పాడ్యమి రోజునుంచి ప్రయాణిస్తుంటారు. వారి దారి చూపేందుకు వీలుగా ఇంటికి దక్షిణ దిశలో దీపాలు వెలిగించాలి. ఈ దీపాల వెలుగు వారి ప్రయాణాన్ని సులభతరం చేస్తుందని గరుడ పురాణం ద్వారా తెలుస్తుంది.
