అసలు దేశద్రోహి ఎవరో తేల్చుకుందాం రండి.. మోడీ దిమాగీ నక్సల్ వ్యాఖ్యలకు రాహుల్ కౌంటర్

అసలు దేశద్రోహి ఎవరో తేల్చుకుందాం రండి.. మోడీ దిమాగీ నక్సల్ వ్యాఖ్యలకు రాహుల్ కౌంటర్

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ దిమాగీ నక్సల్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తనతో ప్రధాని మోడీ బహిరంగ చర్చకు వస్తే అసలు దేశ ద్రోహులు ఎవరో తేల్చుకుందామని తన సవాల్‎ను పునరుద్ఘాటించారు. ఈ మేరకు సోమవారం (నవంబర్ 9) ఎక్స్ వేదికగా రాహుల్ ట్వీట్ చేశారు. ప్రధాని మోడీ చెప్పిన అబద్ధాలను సీఆర్ఎఫ్ జవాన్లు నమ్మలేదని.. వారి ముఖ కవళికల ద్వారా ఈ విషయంగా స్పష్టంగా అర్ధం అయిందన్నారు. 

మోడీ తమను దిమాగీ నక్సల్స్ అని పిలిచారు. ఈ విషయంలో నా సవాల్ కొనసాగుతోంది. మోడీ తనతో బహిరంగ చర్చకు వస్తే అసలు దేశద్రోహి ఎవరు..? విదేశీ శక్తుల చేతుల్లో ఎవరు నడుస్తున్నారు అనేది తేల్చుకుందామన్నారు. ఎప్పుడైనా.. ఎక్కడైనా చర్చకు తాను సిద్ధమని మరోసారి ఛాలెంజ్ చేశారు. తనతో చర్చ ముగిసిన తర్వాత ప్రధాని మోడీకి ఏ ఒక్క జవాన్ ముందు కూడా తల ఎత్తుకుని నిలబడే ధైర్యం ఉండదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

►ALSO READ | 12 ఏళ్ల బాలిక హత్య కేసులో నిందితుడిని కాల్చి చంపిన పోలీసులు

ప్రతియేటా దేశ సరిహద్దుల్లో సైనికులతో దీపావళి వేడుకలు జరుపుకునే ప్రధాని మోడీ ఈ ఏడాది మాత్రం ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టుల కంచుకోట బస్తర్‌లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) జవాన్లతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. అడవుల్లో సాయుధ నక్సలిజం అంతమైనప్పటికీ.. నగరాల్లోని కొన్ని సంస్థలు, రాజకీయ పార్టీల్లోకి దిమాగీ నక్సల్స్ చొరబడ్డారని ప్రతిపక్షాలను ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వీరు రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొడుతున్నారని హాట్ కామెంట్స్ చేశారు.