ఎన్నికల ఓటమితో టీడీపీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. తాడేపల్లిగూడెంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమావేశం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వెంకట్రామన్నగూడెం ఎంపీటీసీ అభ్యర్థి పరిమి రవికుమార్ ఓటమికి సొంత పార్టీ నేతలే కారణమంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఇద్దరు కార్యకర్తలు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా, నాయకులు అడ్డుకున్నారు.
తన ఓటమికి పార్టీ నేతలే కుట్ర చేశారని రవికుమార్ కన్నీటిపర్యంతమయ్యారు. ఎన్నికల సమయంలో తహసీల్దార్ సునీల్ కుమార్ వ్యవహారశైలిపైనా అనుమానాలు వ్యక్తం చేశారు. కాల్ రికార్డులను పరిశీలించి సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
దీంతో టీడీపీ సమావేశం రసాభాసగా మారింది. అధికార పార్టీలోనే అసంతృప్తి జ్వాలలు బహిరంగంగా ఎగసిపడటం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
