Ram Gopal Varma: ఏనుగు వెళ్తుంటే వీధి కుక్కలు మొరుగుతాయి.. 'రామాయణ'పై విమర్శకులకు RGV స్ట్రాంగ్ కౌంటర్!

Ram Gopal Varma: ఏనుగు వెళ్తుంటే వీధి కుక్కలు మొరుగుతాయి.. 'రామాయణ'పై విమర్శకులకు RGV స్ట్రాంగ్ కౌంటర్!

భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో ఒకటిగా తెరకెక్కిన 'రామాయణం' బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.  దీపావళి కానుకగా వచ్చిన ఈ చిత్రం ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి టాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలతో చిత్రబృందంపై ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. దర్శకధీరుడు రాజమౌళి, మహేశ్‌బాబు, సందీప్ రెడ్డి వంగా, విజయ్ దేవరకొండ వంటి ప్రముఖులు ఇప్పటికే తమ అభిప్రాయాలను వెల్లడించారు. లేటెస్ట్ గాఈ జాబితాలోకి సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ చేరడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది

ఇది భక్తి సినిమా కాదు.. భక్తి శక్తి!

సాధారణంగా తనదైన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే ఆర్జీవీ.. ఈసారి మాత్రం 'రామాయణం'పై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాదు, సినిమాను విమర్శిస్తున్న వారికి తనదైన స్టైల్లో గట్టి కౌంటర్ ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా తన సుదీర్ఘ సమీక్షను పంచుకున్న వర్మ.. 'రామాయణం'ను కేవలం భక్తి ప్రధానమైన చిత్రంగా చూడలేమని, అదొక అద్భుతమైన అనుభూతిని కలిగించే శక్తి అని అభివర్ణించారు. రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్ నటనను ప్రత్యేకంగా ప్రశంసించారు. సీత అపహరణ తర్వాత ఖాళీగా ఉన్న ఆశ్రమంలో రాముడు నిలబడే సన్నివేశాన్ని ప్రస్తావిస్తూ.. ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన బాధను కళ్లతోనే పలికించిన రణ్‌బీర్ నటన అద్భుతమని కొనియాడారు.

ఇక రావణుడి పాత్రలో యశ్‌ను చూసి వర్మ ఫిదా అయ్యారు. కేవలం ప్రతినాయకుడిగా కాకుండా, తన నిర్ణయాల పర్యవసానాలు తెలిసినా వెనక్కి తగ్గని బలమైన వ్యక్తిత్వంగా రావణుడిని చూపించారని విశ్లేషించారు. జటాయువు పాత్రలో అనుపమ్ ఖేర్ నటనను కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు. పుష్పక విమానాన్ని అడ్డుకునే సన్నివేశంలో రెక్కలు విరిగినా పోరాటం ఆపని జటాయువు సంకల్పం తనను కదిలించిందని పేర్కొన్నారు.

►ALSO READ | Vijay Rashmika: ఫారెన్లో విజయ్–రష్మిక దీపావళి సెలబ్రేషన్స్.. రొమాంటిక్ పిక్, ఫ్యామిలీ ఫొటోలు వైరల్!

విమర్శకులకు ఆర్జీవీ స్ట్రాంగ్ కౌంటర్..

సినిమాపై వచ్చే ప్రతికూల విమర్శలను పట్టించుకోవద్దని చిత్రబృందానికి వర్మ సూచించారు. ఏనుగు అంతటి భారీ ప్రయత్నం ముందు వీధి కుక్కల మొరుగుల్లా విమర్శలు వినిపిస్తాయని ఘాటుగా వ్యాఖ్యానించారు. అంతేకాదు, నిర్మాత నమిత్ మల్హోత్రాపై ప్రశంసల వర్షం కురిపించారు. తాను చదివిన, విన్న, చూసిన రామాయణాలన్నింటితో పోలిస్తే ఈ వెర్షన్ ఎన్నో రెట్లు గొప్పగా ఉందని, నమిత్ కేవలం సినిమా తీయలేదని, తరతరాలకు నిలిచిపోయే వారసత్వాన్ని సృష్టించారని అన్నారు.

నితేశ్ తివారీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటించారు. అనుపమ్ ఖేర్ జటాయువు పాత్రలో కనిపించారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ భారీ చిత్రానికి నమిత్ మల్హోత్రా నిర్మాత. నవంబర్ 5న తొలి భాగం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మరి ఆర్జీవీ ప్రశంసలతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరుగుతుందేమో చూడాలి.