ఆరోగ్యం కోసం రోజుకో గుడ్డు తినమని పెద్దలు ఊరికే చెప్పలేదు. ఈ రోజుల్లో మన చుట్టుపక్కల ఉండే సూపర్ మార్కెట్ షెల్ఫ్‌లో మెరిసిపోయే ఆకర్షణీయమైన ప్యాకింగ్‌లు చూసి.. "అరెరె.. ఈ ఆరెంజ్ రంగు సొన ఉన్న గుడ్డు తింటే సూపర్ మ్యాన్ అయిపోతాం ఏమో" అని మీరెప్పుడైనా అనుకున్నారా? అసలు గుడ్డు సొనలోని రంగులతో ఉన్న మ్యాజిక్ ఏంటనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి..
మనలో చాలామంది ఆరెంజ్ రంగులో ఉన్న సొన చూడగానే.."అబ్బా.. ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు కుప్పలు కుప్పలుగా ఉండి ఉంటాయి" అని భ్రమపడతారు. మార్కెట్లో కూడా కొన్ని బ్రాండ్లు ఇదే పాయింట్‌ను పట్టుకుని, ఆరెంజ్ సొన గుడ్లను ఎక్కువ ధరకు అమ్ముతూ దర్జాగా క్యాష్ చేసుకుంటున్నాయి. కానీ అసలు సైంటిఫిక్ ట్విస్ట్ ఏమిటంటే.. ఆరెంజ్ సొనకు, పోషకాలకు అస్సలు సంబంధమే లేదట.
మరి ఆరెంజ్ రంగు ఎలా వస్తుంది? కోళ్లకు పెట్టే మేతలో రంగునిచ్చే సింథటిక్ పిగ్మెంట్లను కలపడం వల్ల పసుపుసొన కాస్తా ఆరెంజ్ రంగులోకి మారుతుంది. అంటే అది కేవలం ఒక కలర్ అంతే. లేత పసుపు రంగు సొన ఉన్న నార్మల్ గుడ్డులో ఎలాంటి పోషకాలు ఉంటాయో.. సేమ్ అవే విటమిన్స్ అండ్ మినరల్స్ ఆరెంజ్ సొన ఉన్న 'ప్రీమియం' గుడ్డులోనూ ఉంటాయని తేలిపోయింది.
►ALSO READ | జ్యోతిష్యం : సింహరాశిలోకి కుజుడు.. కార్తీకమాసంలో ఆరు రాశుల వారికి మహాయోగం
ఇక బ్రౌన్ కలర్ గుడ్లు తింటేనే బాడీ డెవలప్ అవుతుందని.. తెల్ల రంగు పెంకు ఉండే గుడ్లలో ఏమీ ఉండవు అనుకోవడం మరొక పెద్ద అపోహ. కోడి రకాన్ని బట్టి పెంకు రంగు మారుతుంది తప్ప.. లోపల ఉన్న గుడ్డు సత్తువలో తేడా ఉండదని మాటలు కాదు సైన్స్ బేస్డ్ టెస్టులు చెబుతున్నాయ్.
కాబట్టి ఫ్రెండ్స్.. కలర్‌ఫుల్ ప్యాకింగ్‌లకు, గుడ్డు లోపలి సొన రంగులకు తేడాలు ఉంటాయ్ అనే మాయలో పడి ఎక్కువ డబ్బులు వేస్ట్ చేసుకోకండి. బ్రాండెడ్ అయినా, నార్మల్ అయినా.. గుడ్డు గుడ్డే. సొన పసుపున్నా, ఆరెంజ్ ఉన్నా మనుషుల బాడీకి అందే న్యూట్రిషన్ సేమ్. సో వ్యాపారం కోసం లాభాల కోసం కొందురు చెప్పే కలర్‌ఫుల్ మాటలను నమ్మి డబ్బులు వేస్ట్ చేసుకోకుండా.. సండే అయినా, మండే అయినా ప్రశాంతంగా మీకు నచ్చిన గుడ్డును ఉడకబెట్టుకుని తినేయండి.
