ఆటో డ్రైవర్ తో పెళ్లి.. ర్యాపిడో డ్రైవర్ తో వివాహేతర సంబంధం.. చివరికి ఇద్దరు...!

ఆటో డ్రైవర్ తో పెళ్లి.. ర్యాపిడో డ్రైవర్ తో వివాహేతర సంబంధం.. చివరికి ఇద్దరు...!

వివాహేతర సంబంధం కారణంగా కుటుంబాలు నాశనం అవుతున్నాయి. తరచూ జరుగుతున్న ఘటనలు చూస్తున్నప్పటికీ జనాల్లో మార్పు రావట్లేదు. కర్ణాటకలో ఇలాంటి మరో ఘటన జరిగింది. కర్ణాటకలోని మండ్య జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి... భర్తతో గొడవ కారణంగా సహన అనే మహిళ రాహుల్ అనే యువకుడితో కలిసి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది.

బెంగళూరులో ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న వీరేశ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది సహన.. వీరికి ఐదేళ్ల కుమార్తె, రెండేళ్ల కొడుకు ఉన్నారు. ఈ క్రమంలో ర్యాపిడో బైక్ డ్రైవర్ తో పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది.ఈ విషయం భర్తకు తెలియడంతో దంపతుల మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి. 

దీంతో రాహుల్‌తో కలిసి మండ్యకు చేరుకున్న సహాన.. ఇండువాల్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున రైలు కిందపడి ప్రాణాలు తీసుకుంది.ఈ ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు మృతదేహాలను మార్చురీకి తరలించారు.