కాసేపట్లో భారత్ vs పాకిస్తాన్ హై–వోల్టేజ్ పోరు.. లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే!

కాసేపట్లో భారత్ vs పాకిస్తాన్ హై–వోల్టేజ్ పోరు.. లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే!

IND vs PAK U19: క్రికెట్ ప్రపంచంలో అత్యంత క్రేజీ సమరానికి సమయం ఆసన్నమైంది. ఏసీసీ పురుషుల యూత్ U19 ఆసియా కప్ 2026 టోర్నీలో భాగంగా గ్రూప్-ఎ లో భారత్, పాకిస్తాన్ జట్లు కాసేపట్లో (ఆదివారం, నవంబర్ 8, 2026) ఒమన్ వేదికగా తలాపడనున్నాయి. తొలి మ్యాచ్‌ల్లో చెరో అద్భుతమైన విజయాన్ని అందుకని జోరుమీదున్న ఇరు జట్లు.. సెమీఫైనల్ బెర్త్ ఖాయం చేసుకోవడమే లక్ష్యంగా మైదానంలోకి దిగుతున్నాయి. 

తొలి మ్యాచ్ విశేషాలు: 

యువ భారత్ ఘనవిజయం: తొలి మ్యాచ్‌లో టీమిండియా U19 నేపాల్‌పై ఏకంగా 10 వికెట్ల తేడాతో తిరుగులేని విజయం సాధించింది. ఇషాన్ సూద్, అర్జున్ రాజ్‌పుత్ తలో 3 వికెట్లు తీసి నేపాల్‌ను 128 రన్స్‌కే పరిమితం చేయగా.. లక్ష్యాన్ని టీమిండియా ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఛేదించింది. ఆర్యావీర్ సెహ్వాగ్ (70), కెప్టెన్ లక్ష్య రాయ్‌చందానీ (53) అర్ధసెంచరీలతో మెరిశారు.

డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్తాన్: డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన పాకిస్తాన్ U19 తొలి పోరులో యూఏఈ (UAE)పై 9 వికెట్ల తేడాతో గెలిచింది. యూఏఈ విధించిన 225 రన్స్ లక్ష్యాన్ని ఈజీగా ఛేదించింది. మహమ్మద్ సయ్యమ్ 3 వికెట్లతో రాణించాడు. కాగా గత ఏడాది ఫైనల్ ఓటమికి రివెంజ్ తీర్చుకోవాలని యువ టీమిండియా పట్టుదలతో ఉండగా.. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాను నిలబెట్టుకోవాలని పాకిస్తాన్ చూస్తోంది. దాంతో ఈ మ్యాచ్ తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. 

భారత్ vs పాకిస్తాన్ లైవ్ స్ట్రీమింగ్: 

* మ్యాచ్ వేదిక: అల్ అమెరాట్ క్రికెట్ గ్రౌండ్, ఒమన్.

* మ్యాచ్ సమయం: ఆదివారం (నవంబర్ 8, 2026) ఉదయం 10:30 AM (IST) కి మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఉదయం 10:00 AM (IST) కి టాస్ పడుతుంది.

* టీవీ లైవ్ (TV Channel): భారతదేశంలో ఈ మ్యాచ్‌ను Sony Sports Network ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు.

* డిజిటల్ లైవ్ స్ట్రీమింగ్ (OTT App): SonyLIV యాప్ మరియు వెబ్‌సైట్‌లో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది.