లాస్ట్ ఐపీఎల్ సీజన్ నుంచి హార్దిక్ పాండ్య ఫ్యూచర్ పై నెలకొన్న సస్పెన్స్ కు తెరపడింది. ముంబైలో ఉంటాడా ఉండడా.. ఈ సారి హార్ధిక్ ను పంపిచేస్తారు అనే ఊహాగానాలను నిజం చేస్తూ ఈ స్టార్ ఆల్ రౌండర్ ను ముంబై వదులుకుంది.
ఐపీఎల్ ఆక్షన్ కు ముందే ముంబై, పంజాబ్ మధ్య డీల్ కుదిరింది. ప్లేయర్స్ ఎక్స్చేంజ్ ఒప్పందంలో హార్దిక్ ను పంజాబ్ తీసుకోగా.. బదులుగా ముంబైకి పేసర్ అర్ష్ దీప్ సింగ్ ను ఇచ్చింది. దీంతో 2027 ఐపీఎల్ లో హార్ధిక్ పంజాబ్ తరఫున ఆడనున్నాడు. ఆల్మోస్ట్ డీల్ ఫైనల్ అయిపోయింది. బీసీసీఐ ఆమోదంతో అధికారికంగా ప్రకటించనున్నట్లు క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.
ఐపీఎల్ వర్గా ప్రకారం.. డీల్ పూర్తయిందని.. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో పంజాబ్ కింగ్స్ కు ఆడేందుకు హార్ధిక్ సంతోషంగా అంగీకరించినట్లు తెలుస్తోంది.
అయితే ప్లేయర్ల మార్పు అనేది కెప్టెన్ , కోచ్ మధ్య చిన్న విషయమే అయినప్పటికీ.. ఇన్నాళ్లుగా టీమ్ కోసం ఆడుతూ వస్తున్న ప్లేయర్లను వదులు కోవడం ఓనర్లకు, ఫ్రాంచేజీలకు కష్టమైన విషయం. అయితే ముంబై ఇండియన్స్ ఫ్రాంచేజీ మాత్రం హార్దిక్ ను వదులుకోవాలని చాలా రోజులుగా భావిస్తోందట. హార్దిక్ నిర్లక్ష్య పూరిత వైఖరితో టీమ్ నష్టపోయినట్లు భావిస్తున్నారు.
2024 సీజన్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా వచ్చాడు హార్దిక్. అప్పటి కెప్టెన్ రోహిత్ శర్మ స్థానంలో జట్టు బాధ్యతలను చేపట్టాడు. అయితే ఈ ప్లాన్ బెడిసికొట్టింది. 5 సార్లు ఛాంపియన్ అయిన ముంబై.. హార్ధిక్ సారథ్యంలో రెండు సార్లు ప్లే ఆఫ్ కు చేరడం కూడా కష్టమైపోయింది.
మరోవైపు అర్ష్ దీప్ ను వదులుకున్న పంజాబ్ డిసిషన్ కూడా అంత ఈజీ కాదు. చాలా రోజులుగా సీమర్ గా ఉంటూ జట్టు విజయాలలో పాలుపంచుకున్న అర్ష్ దీప్ వెళ్లడం ఆ జట్టుకు లోటు కావచ్చు . అర్ష్ దీప్ స్థానంలో హార్ధిక్ ఎంత వరకు జట్టు అంచనాలను ఫుల్ ఫిల్ చేస్తాడనేది చూడాలి.
