ఫలితాలకు ముందు గుండెపోటుతో చనిపోయిన ధుమంతునిగూడెం జనసేన ఎంపీటీసీ అభ్యర్థి దివ్య విజయం సాధించారు. పాపం విజయాన్ని ఆస్వాదించడానికి ఆమె భౌతికంగా లేదు. ఆమె కుటుంబం ఆమెను కోల్పోయిన బాధలో శోకసంద్రంలో మునిగిపోయింది. 352 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థిపై గారపాటి దివ్య గెలిచింది.
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం దుమంతునిగూడెం జనసేన ఎంపీటీసీ అభ్యర్థి శ్రీమతి గారపాటి దివ్య గారు గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ప్రజాసేవ కోసం ఎన్నికల బరిలో నిలిచిన ఆమె అకాల మరణం పార్టీకి తీరని లోటు. ఈ క్లిష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తోంది. దివ్య గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. ఓం శాంతి.
— JanaSena Party (@JanaSenaParty) November 6, 2026
దివ్య ప్రేమ పెళ్లి చేసుకుని భర్త, ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉంది. జనసేన పార్టీలో ఆమె, ఆమె భర్త యాక్టివ్గా పనిచేసేవారు. ధుమంతునిగూడెం నుంచి ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం రిజర్వేషన్లో భాగంగా మహిళకు రావడంతో జనసేన నుంచి దివ్య అభ్యర్థిగా నిలిచింది.
గారపాటి దివ్య మృతిపై జనసేన పార్టీ కూడా ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేసింది. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం దుమంతునిగూడెం జనసేన ఎంపీటీసీ అభ్యర్థి గారపాటి దివ్య గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని జనసేన పార్టీ ట్వీట్ చేసింది.
ప్రజాసేవ కోసం ఎన్నికల బరిలో నిలిచిన ఆమె అకాల మరణం పార్టీకి తీరని లోటని, ఈ క్లిష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తోందని పార్టీ పేర్కొంది. దివ్య ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామని జనసేన పార్టీ ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది.
