హైదరాబాద్: పండుగ సీజన్ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే స్పెషల్స్ ట్రైన్స్ ఏర్పాటు చేసింది. తెలంగాణ నుంచి ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి సుదూర ప్రాంతాలకు ఈ సర్వీసులను నడుపుతోంది. ఈ క్రమంలో ప్రత్యేక రైళ్లలో ఖాళీగా ఉన్న బెర్త్‌ల వివరాలను సౌత్ సెంట్రల్ రైల్వే శనివారం (నవంబర్ 7) వెల్లడించింది. అయితే, రైల్వే బెర్త్‌ల ఖాళీలు క్షణం క్షణం మారుతూ ఉంటాయి.
ప్రయాణికులు బుక్ చేసుకునే కొద్దీ సీట్ల సంఖ్య తగ్గుతుంది. సో.. జర్నీ ప్లాన్ చేసుకునే ప్రయాణికులు IRCTC అధికారిక వెబ్‌సైట్ ద్వారా లేదా రిజర్వేషన్ కౌంటర్లలో వెంటనే ముందస్తు రిజర్వేషన్ చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది. మరీ ఏ ట్రైన్లో ఎన్ని సీట్లు ఖాళీ ఉన్నాయో పూర్తి వివరాలు తెలుసుకుందాం..
1. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రూట్లో నడిచే ట్రైన్స్
- చర్లపల్లి - హజ్రత్ నిజాముద్దీన్ (ట్రైన్ నెం. 07023): నవంబర్ 24న ప్రయాణించడానికి 254 బెర్త్‌లు ఖాళీగా ఉన్నాయి.
- చర్లపల్లి - ప్రయాగ్‌రాజ్ (ట్రైన్ నెం. 04122): నవంబర్ 24న 207 బెర్త్‌లు, అలాగే డిసెంబర్ 1న 293 బెర్త్‌లు అందుబాటులో ఉన్నాయి.
2. బీహార్ వైపు వెళ్లే రైళ్లు
- చర్లపల్లి - బారౌని (ట్రైన్ నెం. 07588): నవంబర్ 15న ఈ రైలులో అత్యధికంగా 861 బెర్త్‌లు అందుబాటులో ఉన్నాయి.
- చర్లపల్లి - ససారామ్ (ట్రైన్ నెం. 07041): నవంబర్ 26న 507 బెర్త్‌లు ఖాళీగా ఉన్నాయి.
- చర్లపల్లి - రక్సాల్ (ట్రైన్ నెం. 07007): నవంబర్ 18న 212 బెర్త్‌లు, నవంబర్ 25న 329 బెర్త్‌లు అందుబాటులో ఉన్నాయి.
- చర్లపల్లి - దానాపూర్ (ట్రైన్ నెం. 07051): నవంబర్ 23న 83 బెర్త్‌లు ఖాళీగా ఉన్నాయి.
- జాల్నా - చప్రా (ట్రైన్ నెం. 07651): నవంబర్ 25న 220 బెర్త్‌లు అందుబాటులో ఉన్నాయి.
- నాందేడ్ - పాట్నా (ట్రైన్ నెం. 07609): నవంబర్ 10న 187, నవంబర్ 17న 412, నవంబర్ 24న 517 బెర్త్‌లు అందుబాటులో ఉన్నాయి.
3. తెలంగాణ లోకల్ ట్రైన్స్
- సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్‌నగర్ (ట్రైన్ నెం. 07711): నవంబర్ 8న 438, నవంబర్ 9న 551, నవంబర్ 10న 547 బెర్త్‌లు ఖాళీగా ఉన్నాయి.
- సిర్పూర్ కాగజ్‌నగర్ - హైదరాబాద్ (ట్రైన్ నెం. 07712): తిరుగు ప్రయాణంలో నవంబర్ 7న 535, నవంబర్ 8న 543, నవంబర్ 9న 76, నవంబర్ 10న 453 బెర్త్‌లు అందుబాటులో ఉన్నాయి.
