తక్కువ ఖర్చుతో ఇంటికి ట్రెడిషనల్ లుక్.. ఈ ఐడియాలు ట్రై చేయండి!

తక్కువ ఖర్చుతో ఇంటికి ట్రెడిషనల్ లుక్.. ఈ ఐడియాలు ట్రై చేయండి!

Traditional Home Decor: పండుగలు వస్తున్నాయంటే ప్రతి ఒక్కరూ తమ ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవాలనుకుంటారు. లివింగ్ రూమ్ నుంచి బెడ్‌రూమ్ వరకు అన్ని గదులు కళకళలాడాలని కోరుకుంటారు. అదీ కూడా ఎక్కువ ఖర్చు కాకుండా, చాలా ఈజీగా అయ్యే డెకోర్ ఐడియాస్ కోసం చూస్తుంటారు. ప్రింటెడ్ ఫ్యాబ్రిక్, నకాషీ ఆర్ట్ ఉన్న దుస్తులను ఉపయోగించి బడ్జెట్‌లోనే ఇంటికి గ్రాండ్ ట్రెడిషనల్ లుక్ ఎలా తీసుకు రావాలో డిజైనర్ అశ్వినీ విద్యా గుప్తే అందించిన కొన్ని బెస్ట్ ఐడియాస్ ఇక్కడ చూద్దాం.. 

ఫ్యాబ్రిక్ ఫ్రేమ్స్ (Wall Art & Backdrops): 

* ప్రింటెడ్ ఫ్యాబ్రిక్ ఫ్రేమ్స్: రంగురంగుల పూలు, రకరకాల బొమ్మలు, ఆకర్షణీయమైన డిజైన్లు ఉన్న ప్రింటెడ్ ఫ్యాబ్రిక్‌ను ఫ్రేమ్ కట్టించి గోడలకు తగిలిస్తే లివింగ్ రూమ్ రూపురేఖలే మారిపోతాయి. ఆన్‌లైన్ లేదా వర్చువల్ వీడియో కాల్స్ మాట్లాడేటప్పుడు ఇవి మంచి బ్యాక్‌డ్రాప్‌గా కూడా కనిపిస్తాయి. 

* ట్రెడిషనల్ పెయింటింగ్స్: చేర్యాల స్క్రోల్ పెయింటింగ్స్ (Cheriyal Scroll Paintings), పురాణ కథలకు సంబంధించిన చిత్రాలు ఉన్న క్లాత్ ఫ్రేమ్స్ గోడలపై ఉపయోగిస్తే ఇంటికి ఒక ప్రత్యేకమైన ఆర్టిస్టిక్, రిచ్ లుక్ వస్తుంది. 

కుషన్ కవర్స్, సీలింగ్ డెకోర్ (Cushion Covers): 

* ఇక్కత్, హ్యాండిక్రాఫ్ట్స్: సోఫాలు, ఆరాం కుర్చీలు మరింత రాయల్‌గా కనిపించాలంటే కుషన్ కవర్స్ డిజైన్ చాలా ముఖ్యం. అందుకోసం మన ఇక్కత్ (Ikat) ప్రింట్ ఉన్న కవర్లు ఎంచుకోవాలి.

* రోగన్, మీనాకారీ ఆర్ట్: గుజరాత్ స్టైల్ రోగన్ ఆర్ట్ (Rogan Art) లేదా మీనాకారీ (Meenakari) వర్క్ ఉన్న క్లోత్ కుషన్ కవర్స్ వాడితే ట్రెడిషనల్ వైబ్స్ వస్తాయి.

* ఫాక్స్ ఫ్యాబ్రిక్ సీలింగ్: గది పైన సీలింగ్‌కి ఫాక్స్ ఫ్యాబ్రిక్ హ్యాంగ్ చేస్తే ఓవరాల్ డెకోర్ గ్రాండ్‌గా ఉంటుంది.

కర్టెన్స్ (Curtains & Lighting): 

* బాందిని కర్టెన్స్: లివింగ్ రూమ్ కలర్‌ఫుల్‌గా కనిపించడానికి టై అండ్ డై మోడల్ బాందిని (Bandhani) కర్టెన్స్ వాడడం ఉత్తమం.

* న్యాచురల్ లైటింగ్: ఈ తేలికపాటి కర్టెన్ల గుండా వెలుతురు ఇంట్లోకి ధారాళంగా వస్తుంది. వీటికి కాంబినేషన్ లైటింగ్ ఏర్పాటు చేసుకుంటే గదంతా ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా మారుతుంది.

ALSO READ : దీపావళి దీపాలు గాలికి ఆరిపోతున్నాయా.. 

వార్డ్‌రోబ్, కిచెన్ లుక్ (Wardrobe & Kitchen Accessories): 

* ఇక్కత్ ప్రింట్ హోల్డర్స్: వార్డ్‌రోబ్‌లు కొత్తగా, అందంగా కనిపించాలంటే ఇక్కత్ ప్రింట్ డిజైన్ ఉన్న హోల్డర్స్ ఉపయోగించాలి.

* కిచెన్ యాక్సెసరీస్: వంటగదికి (Kitchen) కూడా మంచి లుక్ తేవడానికి రకరకాల ట్రెడిషనల్ ఫ్యాబ్రిక్ యాక్సెసరీ హోల్డర్స్ అమర్చుకుంటే సరిపోతుంది. ఈ చిన్న చిన్న మార్పులతో మీ ఇల్లు పండుగ వేళ సరికొత్త శోభతో మెరిసిపోతుంది.