దీపావళి పండుగ దీపాల పండుగ. పెద్దలకన్నా పిల్లలు ఇష్టపడే లైట్స్ ఫెస్టివల్. దీపావళి పండుగ రోజు ఇళ్లు దీపాల వెలుగులో కళకళలాడిపోతాయి. రంగు రంగుల దీపాలు వెలుగుతూ ఉంటాయి. దాదాపు ఇల్లంతా దీపాల వెలుగులు విరజిమ్ముతుంటాయి.. అయితే గుమ్మం దగ్గర .. బయట పెట్టే దీపాలు త్వరగా ఘనమవుతాయి( ఆరిపోతాయి). అలా మళ్లీ మళ్లీ వెలిగించాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కదా.. మరి వెలిగించిన దీపం ఎక్కువ టైం వెలుగుతుండాలంటే ఈ చిట్కాను ట్రై చేయండి. ఇప్పుడు ఆ చిట్కా గురించి తెలుసుకుందాం. . .!
దీపావళి అంటేనే దీపాల పండుగ. ఈ పర్వదినం సందర్భంగా ప్రతి ఇంటినీ దీపాలతో అందంగా అలంకరిస్తారు. ఇంటి గుమ్మం నుంచి వాకిలి వరకు మట్టి ప్రమిదల్లో నూనె లేదా ఆవు నెయ్యి పోసి దీపాలు వెలిగిస్తారు. చీకటిని తొలగించి వెలుగులు నింపే ఈ దీపాలు పండుగ వాతావరణానికి ప్రత్యేక శోభను తీసుకొస్తాయి. అయితే ఇంటి బయట లేదా గాలి వీచే ప్రదేశాల్లో వెలిగించిన దీపాలు కొన్నిసార్లు చిన్నపాటి గాలికే ఆరిపోతుంటాయి. దీంతో వాటిని మళ్లీ మళ్లీ వెలిగించాల్సి వస్తుంది.
దీపం త్వరగా ఆరిపోకుండా, వీలైనంత ఎక్కువసేపు వెలుగుతూ ఉండేందుకు ఇంట్లోనే అందుబాటులో ఉండే నెయిల్ పాలిష్ చిట్కాను ఉపయోగించాలి. ముందుగా మట్టి ప్రమిదలో వత్తి వేసి, దానికి సరిపడా నూనె లేదా నెయ్యి పోయాలి. దీపం వెలిగించే ముందు వత్తి చివర కొద్దిగా నెయిల్ పాలిష్ రాయాలని సూచిస్తున్నారు.
