సోషల్ మీడియాలో రోజుకో వీడియో వైరల్ అవుతుంటుంది. కొన్ని నవ్వులు పూయిస్తే.. మరికొన్ని పెద్ద చర్చకు దారితీస్తాయి. తాజాగా ఓ ఆఫీసులో జరిగిన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ కూడా ఇలాంటి చర్చకే తెరలేపింది. విదేశీ అతిథి ముందు ఓ యువతి బాలీవుడ్ పాటకు స్టెప్పులేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో ఆమె డ్యాన్స్ కంటే.. ఆఫీసులో ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? అన్న ప్రశ్నలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కొందరు ఆమెను సమర్థిస్తుంటే.. మరికొందరు మాత్రం ప్రొఫెషనలిజం ఎక్కడంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు ఆ వీడియోలో ఏముంది? నెటిజన్లు ఏమంటున్నారు?
‘షకీరా’ పాటకు క్రేజీ స్టెప్పులు
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ యువతి పసుపు రంగు చీర ధరించి ఆఫీసులో డ్యాన్స్ చేస్తూ కనిపించింది. 2015లో విడుదలైన ‘వెల్‌కమ్ 2 కరాచీ’ సినిమాలోని ‘షకీరా’ పాటకు ఆమె ఉత్సాహంగా స్టెప్పులేసింది. అదే సమయంలో అక్కడే ఉన్న ఇతర ఉద్యోగులు ఆమెను ప్రోత్సహిస్తూ చప్పట్లు కొడుతూ సందడి చేశారు. ఎదురుగా కూర్చున్న ఓ విదేశీ మహిళ తన ఫోన్‌లో ఈ డ్యాన్స్‌ను రికార్డ్ చేస్తూ కనిపించింది. అయితే ఆ విదేశీ మహిళ యువతి అమెరికన్ బాస్ అంటూ కొన్ని సోషల్ మీడియా అకౌంట్స్ ప్రచారం చేశాయి. కానీ ఆమె ఎవరనే విషయం, ఉద్యోగితో ఉన్న సంబంధం ఏమిటనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. అయినప్పటికీ ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Why do Indian companies feel the need to put on Bollywood dance shows to impress American clients or bosses for Diwali? A traditional puja and sharing mithai are genuine ways to celebrate—let's skip raunchy Bollywood dances... https://t.co/jRC0073hwd
— No Conversion (@noconversion) November 5, 2026
‘ఇదేం ఆఫీస్ కల్చర్?’..నెటిజన్ల ఫైర్!
వీడియో వైరల్ కావడంతో పలువురు నెటిజన్లు యువతి డ్యాన్స్‌పై విమర్శలు చేస్తున్నారు. విదేశీ అతిథులు ఆఫీసుకు వచ్చినప్పుడు ఇలా పాటలు పెట్టి డ్యాన్స్ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. అతిథులకు గౌరవం ఇవ్వడం మంచిదే కానీ.. వారిని మెప్పించడానికి ఇలాంటి ప్రదర్శనలు అవసరమా అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు మాత్రం ఉద్యోగుల ఆత్మగౌరవం, ఆఫీస్ ప్రమాణాల గురించి చర్చిస్తున్నారు. కంపెనీల్లో ప్రొఫెషనలిజానికి ప్రాధాన్యత ఉండాలని, అతిథులను స్వాగతించే పేరుతో హద్దులు దాటకూడదని అభిప్రాయపడుతున్నారు. విదేశీ బాస్‌లను మెప్పించడానికి ఇండియన్స్ ఇంతలా ప్రయత్నించాల్సిన అవసరం లేదని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.
Woman's Bollywood dance for foreign guest at office fuels debate on professionalism "Indians should come out of this slave-like mentality of pampering others and start innovating." "Stop these song-and-dance performances ... Be professional," https://t.co/ae1zJkzqIF https://t.co/IyFPB4eZ6X
— Jai KaalaBhairavi 🇮🇳 (@AYogesa) November 6, 2026
‘అందులో తప్పేముంది?’.. యువతికి మద్దతు!
మరోవైపు కొందరు నెటిజన్లు యువతి డ్యాన్స్‌ను సమర్థిస్తున్నారు. ఇది ఏదో అధికారిక మీటింగ్‌లో జరిగిన కార్యక్రమం కాదని, ఆఫీసులో జరిగిన ఓ ఫెస్టివ్ సెలబ్రేషన్‌లో భాగంగా చూడాలని అంటున్నారు. విదేశీయులు కూడా మన కంపెనీల్లో ఉద్యోగులుగా ఉంటున్నారని, వారితో కలిసి పండుగలు జరుపుకోవడం తప్పు కాదని చెబుతున్నారు. ఒక సాధారణ వేడుకను అనవసరంగా వివాదం చేయొద్దని, ఉద్యోగులు తమకు నచ్చిన విధంగా ఆనందంగా గడిపితే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. వీడియోలోని పూర్తి సందర్భం తెలియకుండా యువతిని విమర్శించడం సరికాదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
►ALSO READ | Summer Holidays Review: నవ్విస్తూనే కన్నీళ్లు పెట్టించే ‘సమ్మర్ హాలిడేస్’.. చిన్నారుల నటనకు ఆడియన్స్ ఫిదా!
గతంలోనూ ఇలాంటి వీడియో వైరల్..
ఆఫీసులో విదేశీ అతిథులను డ్యాన్స్‌తో స్వాగతించడం చుట్టూ గతంలోనూ వివాదం చెలరేగింది. 2025 జూలైలో ఇండియాలోని ఓ ఆఫీసులో ఉద్యోగులు విదేశీ క్లయింట్‌ను స్వాగతిస్తూ తెలుగు, బాలీవుడ్ పాటలకు డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అయింది. ఆ సమయంలోనూ కొందరు భారతీయ ఆఫీస్ కల్చర్‌ను విమర్శించగా.. మరికొందరు దాన్ని ఆతిథ్యం, టీమ్ సెలబ్రేషన్‌గా సమర్థించారు. ఇప్పుడు మరోసారి ఇలాంటి వీడియో తెరపైకి రావడంతో ఆఫీసుల్లో పండుగ వేడుకలు, అతిథులకు ఆతిథ్యం, ఉద్యోగుల వ్యక్తిగత గౌరవం, ప్రొఫెషనలిజం మధ్య ఉండాల్సిన హద్దులపై చర్చ మొదలైంది. మొత్తానికి ఓ చిన్న డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో పెద్ద డిబేట్‌కు కారణమైంది.
