ఇంకో తుఫాన్ ‘ఆక్వాన్’ రెడీ.. నవంబర్ 11 నుంచి నవంబర్ 16 లోపు..

ఇంకో తుఫాన్ ‘ఆక్వాన్’ రెడీ.. నవంబర్ 11 నుంచి నవంబర్ 16 లోపు..

హైదరాబాద్​, వెలుగు: మొన్ననే మురసు తుఫాను పోయింది. ఆ తుఫాను రావడానికి రెండ్రోజుల ముందే అర్నబ్​ ఏపీలో బీభత్సం సృష్టించి పోయింది. రెండు మూడు రోజుల వ్యవధిలో రెండు తుఫాన్లు రావడమే రికార్డ్ అంటే.. ఇప్పుడు మరో తుఫాను రెడీ అయిపోతున్నది.

ఆక్వాన్ సైక్లోన్ ​ఏర్పడేందుకు అవకాశాలున్నాయని వెదర్​ ఎక్స్‌‌పర్ట్స్ చెబుతున్నారు. ప్రస్తుతానికైతే ఇటు నార్త్​ హిందూ మహా సముద్రంలోగానీ, అటు దానికి సంబంధించిన యాక్టివిటీ ఏదీ లేదని అంటున్నారు.

ఈ నెల రెండో వారం చివరలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని, దాని తర్వాతే సైక్లోన్​యాక్టివిటీపై అప్‌‌డేట్ ఉంటుందని చెబుతున్నారు. మూడోవారంలో తుఫాను ఏర్పడే అవకాశాలుంటాయని అంచనా వేస్తున్నారు. దీనిపై వాతావరణ శాఖ కూడా ప్రస్తుతానికి ఇంకా ఎలాంటి అలర్ట్​ఇవ్వలేదని చెబుతున్నారు.

ఈ తుఫాను ఏర్పడితే దాని తీవ్రత ఎంతుంటుందనేది తేలుతుందని చెబుతున్నారు. ఈ తుఫానుకు పేరును ఇరాన్​సూచించగా.. అర్థం వచ్చేలా స్టార్మ్​డీమన్​ (తుఫాను రక్కసి)గా పెట్టారు.