37 శాతం పెరిగిన ఎస్ఈటీఎల్ లాభం... సెప్టెంబర్ క్వార్టర్లో రూ.28 కోట్లు

37 శాతం పెరిగిన ఎస్ఈటీఎల్ లాభం... సెప్టెంబర్ క్వార్టర్లో రూ.28 కోట్లు

హైదరాబాద్​, వెలుగు: ఇంజినీరింగ్ సేవల అందించే హైదరాబాద్​కంపెనీ స్టాండర్డ్ ఇంజినీరింగ్ టెక్నాలజీ లిమిటెడ్  (ఎస్​ఈటీఎల్​) సెప్టెంబర్‌‌‌‌తో ముగిసిన రెండో క్వార్టర్లో అదరగొట్టింది. గతేడాదితో పోలిస్తే క్యూ2 మొత్తం ఆదాయం 62.3 శాతం పెరిగి రూ.296.6 కోట్లకు చేరుకుంది. నికర లాభం ఏకంగా 37.9 శాతం వృద్ధితో రూ.28.2 కోట్లుగా నమోదైంది. 

ఇబిటా సైతం 79.7 శాతం పెరిగి రూ.51.4 కోట్లకు ఎగబాకింది. తొలి అర్ధభాగం (హెచ్1)లో సైతం సంస్థ ఆదాయం 53 శాతం మేర పెరిగి రూ.544.3 కోట్లకు చేరింది. ఫార్మా, కెమికల్, బయోటెక్నాలజీ, ఫుడ్, ఏఐ డేటా సెంటర్ రంగాల్లో సంస్థ అందిస్తున్న సేవలకు మార్కెట్లో మంచి స్పందన లభిస్తోంది. 

ఏఐ డేటా సెంటర్ల కోసం చేపట్టిన జీస్కేల్ ప్రాజెక్టుల ద్వారా నాలుగో క్వార్టర్లో అదనంగా రూ.250 కోట్ల ఆదాయాన్ని అంచనా వేస్తున్నట్లు సంస్థ ఎండీ  నాగేశ్వర రావు తెలిపారు. గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ కోసం జీఎల్ హక్కో నుంచి19.19 శాతం వాటాను కొన్నామని వెల్లడించారు.