రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ బీ మ్యాచ్ లో  రాణించిన అభిరత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వరుణ్‌‌‌‌‌‌‌‌

రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ బీ మ్యాచ్ లో  రాణించిన అభిరత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వరుణ్‌‌‌‌‌‌‌‌

సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: టార్గెట్‌‌‌‌‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో అభిరత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి (68), వరుణ్‌‌‌‌‌‌‌‌ గౌడ్‌‌‌‌‌‌‌‌ (55) హాఫ్ సెంచరీలు సాధించడంతో.. చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌తో జరిగిన రంజీ ట్రోఫీ ఎలైట్‌‌‌‌‌‌‌‌ గ్రూప్‌‌‌‌‌‌‌‌–బి మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ జట్టు ఒక్క వికెట్ తేడాతో గెలిచింది. చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్ నిర్దేశించిన 259 రన్స్‌‌‌‌‌‌‌‌ లక్ష్య ఛేదనలో 13/2 ఓవర్‌‌‌‌‌‌‌‌నైట్‌‌‌‌‌‌‌‌ స్కోరుతో నాలుగో బరిలోకి దిగిన హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 79.4 ఓవర్లలో 259/9 స్కోరు చేసి నెగ్గింది. 

రాహుల్‌‌‌‌‌‌‌‌ రాధేశ్‌‌‌‌‌‌‌‌ (39), చామ మిలింద్‌‌‌‌‌‌‌‌ (22), అనికేత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి (39 నాటౌట్‌‌‌‌‌‌‌‌), రక్షణ్‌‌‌‌‌‌‌‌ రెడ్డి (15 నాటౌట్‌‌‌‌‌‌‌‌) మెరుగ్గా ఆడారు. హిమతేజ (8), ప్రజ్ఞయ్‌‌‌‌‌‌‌‌ రెడ్డి (1), తనయ్‌‌‌‌‌‌‌‌ త్యాగరాజన్‌‌‌‌‌‌‌‌ (8) నిరాశపర్చారు. దేవ్‌‌‌‌‌‌‌‌ ఆదిత్య సింగ్‌‌‌‌‌‌‌‌ 3, ధర్మేంద్రసిన్హ్‌‌‌‌‌‌‌‌ జడేజా, జయంత్‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌, అజయ్‌‌‌‌‌‌‌‌ మండల్‌‌‌‌‌‌‌‌ తలా రెండు వికెట్లు తీశారు. అనికేత్‌‌‌‌‌‌‌‌ రెడ్డికి ‘ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌’ అవార్డు లభించింది. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు 6 పాయింట్లు లభించాయి.