హైదరాబాద్, వెలుగు: ఆసియా శాకాహార రుచులకు నెలవైన తమాషా రెస్టారెంట్ హైదరాబాద్మాదాపూర్లో తిరిగి ప్రారంభమైంది. ప్రముఖ షెఫ్‌లు సంజయ్ తుమ్మా, విక్రమ్ సింహ ప్రత్యేక మెనూను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా 10 రోజుల పాటు సాగే కొరియన్ రామెన్, మండు ఫుడ్ ఫెస్టివల్‌ను ప్రారంభించారు.
ఇందులో పనీర్ ఆన్ ఫైర్ రామెన్, కిమ్చి మీ సాఫ్ట్లీ రామెన్, సియోల్ ఫైర్ మండు వంటి ఎన్నో ప్రత్యేక కొరియన్ వంటకాలు ఉంటాయి. జపనీస్ శైలి ఫ్లోర్ సీటింగ్‌తో రెస్టారెంట్‌ను తీర్చిదిద్దినట్లు వ్యవస్థాపకుడు మహేంద్ర వ్యాస్ తెలిపారు.
