న్యూఢిల్లీ: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కొన్ని కాలపరిమితుల డిపాజిట్లపై వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. రూ.3 కోట్లలోపు డిపాజిట్లకు ఈ రేట్లు వర్తిస్తాయి. సాధారణ ఖాతాదారులకు ఐదేళ్ల ఒక రోజు నుంచి 10 ఏళ్ల డిపాజిట్లపై గరిష్ఠంగా 6.60 శాతం వడ్డీ లభించనుంది. గతంలో ఇది 6.15 శాతంగా ఉండేది.
ఆరు నెలల ఎఫ్డీపై వడ్డీని 4.25 శాతం నుంచి 4.75 శాతానికి పెంచింది. మిగతా కొన్ని కాలపరిమితులపైనా 5 నుంచి 20 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ పెంచింది. సీనియర్ సిటిజన్లకు 3–5 ఏళ్ల డిపాజిట్లపై గరిష్టంగా 7.20 శాతం వడ్డీ అందించనుంది. 5–10 ఏళ్ల డిపాజిట్లపై 7.10 శాతం వడ్డీ వస్తుంది.
