దోహా: ఇండియా షూటర్ జైపాల్ మాల్వియా.. ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో సత్తా చాటాడు. మెన్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ పిస్టల్ విభాగంలో సిల్వర్ మెడల్ సాధించడంతో పాటు 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌కు ఇండియా తరఫున తొలి కోటా సాధించాడు. హోరాహోరీగా సాగిన ఫైనల్లో జైపాల్ 242.2 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు.
విమెన్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ విభాగంలో మను భాకర్, సురుచి ఇందర్‌సింగ్, సైన్యం కూడిన ఇండియా 1738 పాయింట్లతో సిల్వర్ మెడల్‌ను సొంతం చేసుకుంది.
చైనాకు (1745) గోల్డ్ లభించింది. క్వాలిఫికేషన్స్‌లో మను (583), సురుచి (580) వరుసగా మూడు, ఎనిమిదో స్థానంతో ఫైనల్‌కు చేరగా, సైన్యం (575) 22వ ప్లేస్‌తో సరిపెట్టుకుంది. అయితే హోరాహోరీగా సాగిన ఫైనల్లో మను (179.9), సురుచి (158.3) వరుసగా ఐదు, ఆరు స్థానాలతో సరిపెట్టుకున్నారు. ఫలితంగా పతకంతో పాటు ఒలింపిక్స్ కోటాను కూడా దక్కించుకోలేకపోయారు.
