ధనత్రయోదశికి బ్రేక్ తీసుకున్న గోల్డ్ అండ్ సిల్వర్.. హైదరాబాదీస్ వెంటనే షాపింగ్ చేసేయండి

ధనత్రయోదశికి బ్రేక్ తీసుకున్న గోల్డ్ అండ్ సిల్వర్.. హైదరాబాదీస్ వెంటనే షాపింగ్ చేసేయండి

ఈసారి ధనత్రయోదశికి బంగారం, వెండి రేట్లు స్థిరంగా సామాన్యులకు అందుబాటు రేట్లలో కొనసాగుతున్నాయి. అవును అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో ఈ వారం ప్రారంభం నుంచి పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు చిన్న బ్రేక్ తీసుకున్నాయి. ఈ క్రమంలో వెండి రేట్లు కూడా భారీగా తగ్గి స్థిరంగా కొనసాగుతున్నాయి. దీపావళికి ముందు వీకెండ్ షాపింగ్ చేద్దాం అనుకుంటున్న వారు ముందుగా తమ నగరాల్లోని రేట్లను పరిశీలించి ముందుకెళ్లటం బెటర్. అయితే దీనికి ముందు వివిధ జ్యువెలర్స్ అందిస్తున్న తరుగు, మజూరి ఆఫర్లను కూడా పరిశీలించి ముందుకెళ్లండి. 

నవంబర్ 6న బంగారం రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు ఎలాంటి మార్పు లేకుండా కొనసాగుతోంది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.14వేల 602గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 385గా కొనసాగుతోంది. 

ALSO READ : మళ్లీ ఫోన్ల ధరలకు రెక్కలు... 

శుక్రవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. నవంబర్ 6, 2026న దేశవ్యాప్తంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కూడా స్వచ్ఛమైన వెండి కేజీకి రూ.2లక్షల 10వేలుగా కొనసాగుతోంది. అంటే గ్రాము దాదాపు రూ.210 దగ్గర ఉంది. ప్రస్తుతానికి స్థిరంగా కొనసాగుతున్న వెండి రేట్లు భవిష్యత్తులో కొంత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.