లక్ష్మి దేవి పుట్టిన రోజు : ఇవాళ, రేపు 6, 7 తేదీల్లో ఈ వస్తువులు కొనండి.. ఈ వస్తువులు కొనొద్దు..!

లక్ష్మి దేవి పుట్టిన రోజు : ఇవాళ, రేపు 6, 7 తేదీల్లో ఈ వస్తువులు కొనండి.. ఈ వస్తువులు కొనొద్దు..!

దీపావళి వేడుకల్లో  ధన త్రయోదశి పవిత్రమైన రోజున ( నవంబర్​ 6,7 తేదీల్లో) ఇంటికి కొన్ని వస్తువులు తెచ్చుకోవడం, షాపింగ్ చేయడం లక్ష్మీదేవిని మన ఇంటికి ఆహ్వానించడమే నని పండితులు చెబుతున్నారు.  పురాణాల ప్రకారం ఆశ్వయుజ మాసం  కృష్ణ పక్షం త్రయోదశి రోజు లక్ష్మీదేవి పుట్టిన రోజు.  మరి అలాంటి పవిత్రమైన రోజున ఏ వస్తువలు కొనాలి.. ఏవి కొనకూడదో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .! 

బంగారం, వెండి వస్తువులు:ధన త్రయోదశి అనగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది బంగారం,వెండి .ఈ రోజున ( నవంబర్​ 6,7)బంగారం లేదా వెండి కొనుగోలు చేస్తే... సంపద రెట్టింపు అవుతుందని నమ్ముతారు. మీ దగ్గర బడ్జెట్ తక్కువగా ఉంటే... అర గ్రాము బంగారు నాణేన్ని కొనుగోలు చేయండి.. లక్ష్మీదేవి, వినాయకుడి బొమ్మలు ఉన్న వెండి నాణేలను కూడా మీరు పూజ కోసం కొనుగోలు చేయవచ్చు.  అయితే, బంగారం,వెండి కొనుగోలు చేసేటప్పుడు హాల్ మార్క్ ఉందో లేదో చెక్ చేసుకోండి.

కొత్త పాత్రలు: అందరికీ బంగారం కొనే స్థోమత ఉండకపోవచ్చు. అలా అని నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదు. ధన త్రయోదశి  రోజన మీరు ఇంట్లోకి ఏవైనా కొత్త వస్తువులు కొనుగోలు చేయచ్చు. దేవుడి పూజకు వాడే ఇత్తడి చెంబు దీపాలు లేదా రాగి పాత్ర లాంటివి కొనుగోలు చేయవచ్చు.  రోజువారీ వంట గదికి అవసరం అయ్యే స్టీల్ పళ్లెం, గ్లాస్ లాంటివి ఏవైనా కొత్త పాత్రలు కొనుగోలు చేయచ్చు.

లక్ష్మీదేవి స్వరూపం చీపురు:  వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ధనత్రయోదశి  రోజున చీపురు కొనడం ఒక అత్యంత శక్తివంతమైన సాంప్రదాయం. చీపురును శ్రీలక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఇది ఇంట్లోని పేదరికాన్ని  తుడిచిపెట్టి పరిశుభ్రతను, పాజిటివ్ వైబ్‌ను తెస్తుంది. ఇంటికి మంచి శుభ ఫలితాలను తెస్తుంది.

దీపావళి పూజ కోసం: లక్ష్మీ-గణపతి విగ్రహాలు, దీపాలను ధన త్రయోదశి రోజు లక్ష్మీదేవి, విఘ్నేశ్వరుడు, ధన్వంతరి దేవుడి అనుగ్రహం కోసం కొత్త విగ్రహాలు లేదా పూజా సామగ్రి కొనడం ఆనవాయితీ. మట్టి, ఇత్తడి లేదా వెండితో చేసిన లక్ష్మీ-గణేశుల చిన్న విగ్రహాలు కొనుగోలు చేయాలి. ఆల్రెడీ ఇంట్లో ఉంటే మళ్లీ కొనాల్సిన అవసరం లేదు.

ధనియాలు : ధంతేరస్ నాడు ధనియాలు కొని పూజలో ఉంచడం ఎంతో మంచిదని పండితులు చెబుతున్నారు.. పూజ తర్వాత వీటిని తోటలో లేదా కుండీలో నాటుతారు.

పసుపు:  హిందూ సంప్రదాయాల్లో పసుపునకు చాలా ప్రాముఖ్యత ఉంది.  ఏ శుభకార్యం జరిగినా.. ఎలాంటి పూజ చేసుకోవాలన్నా ముందుగా పసుపు వినాయకుడికి పూజిస్తారు. పసుపును అదృష్టంగా భావిస్తారు.  ధనత్రయోదశి రోజున మీ బడ్జెట్​ ను బట్టి...  ఈ వస్తువులు ఇంటికి తెచుకుంటే శుభం కలుగుతుందని పండితులు చెబెతున్నారు..

కొనకూడని వస్తువులు

 ఇనుప వస్తువులు: ఇనుము శనిదేవునికి సంబంధించిన లోహంగా భావిస్తారు. ఈ రోజున ఇనుము కొంటే కుబేరుని అనుగ్రహం లభించదని నమ్ముతారు.

పదునైన వస్తువులు: చాకులు, కత్తులు, కత్తెరలు, బ్లేడ్లు వంటి పదునైన వస్తువులు కొనుగోలు చేయడం అశుభం అని చెబుతారు. ఇలాంటి వస్తువులు గొడవలకు ప్రతిరూపమని పండితులు చెబుతున్నారు.  అందుకే ఈ వస్తువులు అస్సలు కొనకూడదు.

 గాజు సామగ్రి: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గాజును రాహువుకు ప్రతీకగా భావిస్తారు.  రాహువు ప్రతికూల శక్తిని కలుగజేస్తాడు.  ఈ వస్తువులు చాలా పెళుసుగా ఉండి విరిగిపోతాయి.  కాబట్టి గాజు పాత్రలు  కొనడం మంచిది కాదని పండితులు చెబుతున్నారు.

 నలుపు రంగు దుస్తులు: ధన త్రయోదశి లాంటి పవిత్రమైన రోజున నలుపు రంగు దుస్తులు ... నలుపు రంగు వాహనాలు కొనకూడదు.  నలుపు రంగు అశుభాలను సూచిస్తుంది.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం.. ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.