మహబూబాబాద్ జిల్లాలో మైనర్ బాలికల గర్భధారణ కలకలం రేగింది. జిల్లా కేంద్రంలోని పాలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో మైనర్ బాలికల గర్భధారణ కేసులు పెరుగుతున్న క్రమంలో రంగంలోకి దిగారు అధికారులు. శుక్రవారం ( నవంబర్ 6 ) పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు అధికారులు. పోలీస్, రెవెన్యూ, వైద్య అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఈ తనిఖీలకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో అక్రమ అబార్షన్లు, మైనర్ బాలికల గర్భధారణ కేసులు పెరుగుతున్న క్రమంలో రంగంలోకి దిగారు అధికారులు. అధికారులు తనిఖీలకు వెళ్లిన విషయం తెలుసుకున్న ఆసుపత్రి ఓనర్లు ల్యాబ్ లకు తలలు వేసి పరుగులు పెట్టారు.
ఈ క్రమంలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇటీవల డెలివరీ అయిన మహిళల వివరాలు సేకరించారు అధికారులు. అక్రమ అబార్షన్ లు జరిగితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు అధికారులు.
అక్రమ అబార్షన్ చేసిన ,సహకరించిన చర్యలు తప్పవని హెచ్చరించారు అధికారులు. అధికారుల తనిఖీలతో పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రుల సిబ్బంది అప్రమత్తమయ్యారు.
