ట్రంప్ పార్టీ కోసం రూ.4వేల 400 కోట్లు ఖర్చు చేసిన ఎలాన్ మస్క్.. రిపబ్లికన్ల ఓటమితో పోస్ట్స్ డిలీట్

ట్రంప్ పార్టీ కోసం రూ.4వేల 400 కోట్లు ఖర్చు చేసిన ఎలాన్ మస్క్.. రిపబ్లికన్ల ఓటమితో పోస్ట్స్ డిలీట్

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీకి మద్దతుగా పెట్టిన సోషల్ మీడియా పోస్టులను ఎలక్షన్స్ తర్వాత తొలగించడం రాజకీయంగా సంచలనం రేపింది. అక్టోబర్ 29న రిపబ్లికన్ అభ్యర్థులకు ఓటు వేయాలని ఆయన చేసిన పిలుపును, టెక్సాస్ సెనేట్ ఎన్నికల్లో డెమోక్రాట్ జేమ్స్ తలారికో గెలుపొందిన తర్వాత మస్క్ తొలగించారు. ఈ పరిణామాలను మస్క్ ఏఐ చాట్‌బాట్ 'గ్రోక్' కూడా ధృవీకరించింది. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మస్క్ స్పందిస్తూ.. వ్యంగ్యంగా కామెంట్ చేయటంతో పాటు అంతరిక్షంలో డేటా సెంటర్ల ఏర్పాటు గురించి పోస్ట్ పెట్టారు.

మధ్యంతర ఎన్నికల కోసం మస్క్ ఏకంగా రూ. 4వేల 400 కోట్లు ఖర్చు చేసినట్లు ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ నివేదికలు బయటపెట్టాయి. ఇందులో సుమారు రూ. 2వేల 073 కోట్లు తన సొంత రాజకీయ యాక్షన్ కమిటీ 'అమెరికా ప్యాక్' ద్వారా ఓటర్ల చేరవేత, డిజిటల్ ప్రకటనల కోసం ఖర్చు చేశారు. టెక్సాస్ సెనేట్ రేసుతో పాటు న్యూయార్క్, న్యూజెర్సీ, ఐయోవా వంటి కీలక ప్రాంతాల్లో రిపబ్లికన్ల గెలుపు కోసం భారీగా విరాళాలు అందించారు.

ఎన్నికల ఫలితాల ప్రభావం మస్క్ వ్యాపార సామ్రాజ్యంపై తీవ్రంగా పడింది. కొత్త డెమోక్రటిక్ కాంగ్రెస్ రెగ్యులేషన్లను నెమ్మదింపజేస్తుందనే ఆందోళనలతో మస్క్ సంపద భారీగా క్షీణించింది. టెస్లా, స్పేస్ ఎక్స్ షేర్లు ఒక్కసారిగా పడిపోవడంతో మస్క్ నికర విలువ రూ. 2 లక్షల 27వేల కోట్లకు పైగా ఆవిరైంది. 

టెస్లా, స్పేస్ ఎక్స్ కంపెనీలు ఈ మిడ్‪టర్మ్ ఎన్నికల అనంతర పరిణామాలతో మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో ఏకంగా రూ.40 లక్షల కోట్లకు పైగా విలువను కోల్పోయాయి. రాజకీయంగా పెట్టిన భారీ పెట్టుబడులు ఫలితాలను ఇవ్వకపోగా.. స్టాక్ మార్కెట్లో కంపెనీల షేర్ల పతనం ఎలాన్ మస్క్‌కు ఒకేసారి రాజకీయంగా, ఆర్థికంగా పెద్ద ఎదురుదెబ్బగా మారింది.