2027 అకడమిక్ ఇయర్ కి గాను ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కి సంబంధించిన షెడ్యూల్ ప్రకటించింది CBSE. 10th, 12th క్లాసులకు సంబంధించి ప్రాక్టికల్స్, ఇంటర్నల్స్, ప్రాజెక్ట్ అసెస్మెంట్ల షెడ్యూల్ విడుదల చేసింది CBSE. ప్రాక్టికల్ పరీక్షలు నవంబర్ 9 నుండి డిసెంబర్ 19, 2026 వరకు నిర్వహించనున్నట్లు తెలిపింది.
సీబీఎస్ఈ ప్రాక్టికల్ పరీక్షలు 2027:
ప్రాక్టికల్ పరీక్షలు, ప్రాజెక్ట్ అసెస్మెంట్లు, ఇంటర్నల్ అసెస్‌మెంట్లు నిర్వహించడానికి ముందే అర్హులైన అభ్యర్థుల జాబితాను ఖరారు చేయాలని శీతాకాలంలో పాఠశాలలు నిర్వహించనున్న పాఠశాలలను ఆదేశించింది CBSE. ఆన్‌లైన్ అభ్యర్థుల జాబితా ద్వారా పేర్లు సమర్పించిన విద్యార్థులను మాత్రమే పరీక్షలు రాయడానికి అనుమతించాలని తెలిపింది.
10వ తరగతి ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఒక్కసారి మాత్రమే నిర్వహిస్తామని బోర్డు స్పష్టం చేసింది. పాఠశాలలు నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం అర్హులైన అభ్యర్థులందరి మూల్యాంకనాన్ని పూర్తి చేసి, మార్కులను అప్‌లోడ్ చేయాలని తెలిపింది.
అవసరమైన చోట ఎక్స్టర్నల్ పరీక్షలను పరిశీలకులను నియమించుకోవడానికి సంబంధిత సీబీఎస్ఈ ప్రాంతీయ కార్యాలయాలను సంప్రదించవలసిందిగా పాఠశాలలకు సూచించింది CBSE.
ప్రాక్టికల్ పరీక్షలు, ప్రాజెక్ట్ అసెస్మెంట్లు, ఇంటర్నల్ అసెస్‌మెంట్‌లు సకాలంలో పూర్తయ్యేలా చూడాలని పాఠశాలలను సూచించింది. సూచించిన విధంగా 12వ తరగతి ప్రాక్టికల్ పరీక్ష జవాబు పత్రాలను సంబంధిత సీబీఎస్ఈ ప్రాంతీయ కార్యాలయాలకు పంపాలని తెలిపింది.
