20 ఏళ్ల కాపురం తర్వాత.. భార్యతో సహా అత్తింటి ఫ్యామిలీ మొత్తాన్ని ఎందుకు చంపాడు.. !

20 ఏళ్ల కాపురం తర్వాత.. భార్యతో సహా అత్తింటి ఫ్యామిలీ మొత్తాన్ని ఎందుకు చంపాడు.. !

అతని పేరు ఇందుశేఖర్.. వయస్సు 50 ఏళ్లు.. పెళ్లయ్యి 20 ఏళ్లు.. ఓ కూతురు ఉంది. భార్య పేరు సునీత. ఆటోడ్రైవర్గా జీవనం. బెంగళూరు సిటీలోని రాజాజినగర్ లో నివాసం. భార్య ఫ్యామిలీ సైతం బెంగళూరు సిటీలోనే నివాసం. రెండు ఫ్యామిలీలు పెద్దగా ధనవంతులు ఏమీ కాదు.. చిన్న ఉద్యోగాలు, ఉపాధి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాయి.

పోలీసుల విచారణలో ఇందు శేఖర్ తన గోడు వెళ్లబోసుకున్నాడు. భార్య, ఆమె కుటుంబం నుంచి వేధింపులు ఎదురైతే దూరంగా ఉంటే సరిపోయేది. కానీ.. అందరినీ చంపేయాలని అతను తీసుకున్న నిర్ణయం అతనిని ఊచలు లెక్కపెట్టేలా చేసింది. అతనిలోని కోపం ఉన్మాదంగా మారి ఇందు శేఖర్ను విచక్షణ మరిచేలా చేసింది. నరరూప రాక్షసుడిగా మార్చింది. పోలీసుల విచారణలో ఇందు శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. 20 ఏళ్ల క్రితం సునీతను పెళ్లి చేసుకున్నాడు ఇందుశేఖర్. పెద్దలు కుదిర్చిన పెళ్లినే ఇది.

పెళ్లయినప్పటి నుంచి భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తాయి. భార్య సునీత నుంచి సూటిపోటి మాటలు, గొడవలతో ఇందు శేఖర్కు విరక్తి కలిగింది. చిన్నచిన్న గొడవలు జరిగిన ప్రతిసారీ సునీత కుటుంబం జోక్యం చేసుకోవడం అతనికి ఏమాత్రం నచ్చలేదు. అప్పటి నుంచి అతని భార్యపై, ఆమె కుటుంబంపై పగ పెంచుకున్నాడు.

20 ఏళ్లుగా ఇలా కలహాల కాపురం చేస్తున్న భార్యాభర్తల మధ్య ఇటీవల గొడవలు తారా స్థాయికి చేరాయి. బామ్మర్దులకు పెళ్లిళ్లు అయ్యాయి.. వాళ్లకు భార్యలు వచ్చారు.. వాళ్లకు పిల్లలు పుట్టారు. అంతా సర్దుకుంటుంది.. తన భార్య మారుతుందని భావించానని ఇందు శేఖర్ చెప్పాడు. అయినా తన భార్య సునీత ప్రవర్తనలో మార్పు రాలేదని, బామ్మర్దులు జోక్యం మరింత ఎక్కువైందని చెప్పుకొచ్చాడు.

20 ఏళ్ల తర్వాత.. 50 ఏళ్ల వయస్సులో నిందితుడు అయిన భర్త ఇందుశేఖర్.. ఇక లాభం లేదు అనుకున్నాడు. 20 ఏళ్లుగా నరకంగా మారిన సంసారానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నాడు. ఇలాంటి సమయంలో కొంచెం విజ్ఞతతో.. భవిష్యత్ గురించి ఆలోచించే వాళ్లు అయితే ఇల్లు వదిలేసి వెళ్లిపోయేవారు.. అందుకు భిన్నంగా ఇందు శేఖర్ చాలా క్రూరమైన నిర్ణయం తీసుకున్నాడు.

20 ఏళ్లుగా ఇంట్లో గొడవలకు కారణం అయిన అందర్నీ చంపేయాలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగా భార్య సునీతను చంపేశాడు. ఈ తర్వాత తన అత్త (పిల్లనిచ్చిన అత్త)ను చంపేశాడు. ఆ తర్వాత తన ఇద్దరు బామ్మర్దులను చంపాడు. ఆ తర్వాత వాళ్ల భార్యలను చంపాడు.. తన బామ్మర్ది ఏడేళ్ల కొడుకును చంపాడు. ఇలా అత్తింటి ఫ్యామిలీ మొత్తాన్ని అంతం చేశాడు ఇందుశేఖర్. ఇన్ని హత్యలు చేసిన తర్వాత తన ఇంటి మొత్తాన్ని రసాయనాలతో శుభ్రం చేశాడు.

అందర్నీ ఒకేసారి చంపలేదు ఇందుశేఖర్. మందు పార్టీ అంటూ మొదట బామ్మర్ధులు ఒక్కొక్కరిని ఇంటికి పిలిచాడు. ఆ తర్వాత తన మరదలను పిలిచాడు.. ఇలా ప్లాన్ ప్రకారం.. ఒక్కొక్కరిని ఇంటికి పిలిచి మరీ చంపేశాడు క్రూరుడు అయిన భర్త ఇందుశేఖర్.

కర్నాటక రాష్ట్రం బెంగళూరు సిటీలోని రాజాజీనగర్ లో జరిగిన ఏడు హత్యల వెనక కారణం ఇదే అంటూ.. పోలీస్ విచారణలో వెల్లడించారు నిందితుడు అయిన భర్త ఇందుశేఖర్.. విచారణ ఇంకా కొనసాగుతుంది. మృతదేహాలు మొత్తం ఇంకా లభ్యం కాలేదు. వాటి కోసం వెతుకుతున్నారు పోలీసులు. కర్నాటక రాష్ట్రంలోనే కాదు.. దేశం మొత్తం నివ్వెరపోయే విధంగా సాగిన ఈ హత్యాకాండ వెనక.. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.