జ్యోతిష్యం: లక్ష్మీదేవి అనుగ్రహం కోసం దీపావళి రోజు..ఏ రాశి వారు ఏం చేయాలి

జ్యోతిష్యం:  లక్ష్మీదేవి అనుగ్రహం కోసం దీపావళి రోజు..ఏ రాశి వారు ఏం చేయాలి

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ ఏడాది ( 2026)  దీపావళికి ముందు శుక్రుడు వక్రగతిలో, నీచస్థితిలో ఉండగా.. బుధుడు కూడా వక్రగతిలో సంచరిస్తాడు. సూర్యుడు నీచస్థితిలో ఉండటం..  గురు గ్రహం కేతువుతో కలిసి ఉండటం వల్ల గ్రహాల స్థితిగతులకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ నేపథ్యంలో దీపావళి రోజున  ( నవంబర్​ 8)  లక్ష్మీదేవిని పూజించి, ప్రత్యేక నైవేద్యాలు సమర్పించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మరి ఏ రాశి వారు  ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలుసుకుందాం...!

దీపావళి పండుగ ఈ ఏడాది (2026) నవంబర్​ 8 వ తేదీన జరుపుకుంటున్నాయి.  సాధరణంగా దీపావళి పండుగ రోజు శ్రీ మహాలక్ష్మిదేవికి పూజలు చేస్తారు.  కొంతమంది వారి ఆచారాల ప్రకారం కేదారీశ్వర వ్రతాలను భక్తి శ్రద్దలతో పూజిస్తారు.  వ్యాపారస్తులు ఈ పర్వదినాన లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలని  పూజలు చేస్తారు.  అయితే ఈ ఏడాది దీపావళి రోజున గ్రహాల సంచారం ఆధారంగా ప్రతి రాశి వారు కొన్ని ప్రత్యేక నియమాలు పాటించాలని పండితులు చెబుతున్నారు. 

 హిందూ సంప్రదాయంలో దీపావళికి ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. ఈ పర్వదినాన లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే సుఖసంతోషాలు, ఐశ్వర్యం కలుగుతాయని భక్తుల నమ్మకం. ముఖ్యంగా దీపావళి రోజున లక్ష్మీ పూజతో పాటు కొన్ని ప్రత్యేక పరిహారాలు పాటించడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు.

మేష రాశి:  దీపావళి రోజున లక్ష్మీదేవికి ఎర్రటి పువ్వులు సమర్పించాలి.  ఆవునెయ్యితో దీపం వెలిగించి, పూజ సమయంలో ‘ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః’ మంత్రాన్ని జపించాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగి సంతోషం కలుగుతుందని నమ్ముతారు.

వృషభ రాశి:  ఈ రాశి వారు అమ్మవారికి తెల్లని పువ్వులు, పాలతో చేసిన ఖీర్ నైవేద్యంగా సమర్పించాలి. సుగంధ ధూపం వెలిగించి లక్ష్మీదేవిని ప్రార్థించాలి.

 మిథున రాశి:  ఈ రాశి వారు లక్ష్మీదేవికి పచ్చి యాలకులు లేదా పచ్చని పండ్లు సమర్పించాలి. గణేశుడిని ప్రత్యేకంగా పూజించాలి. ఇలా చేయడం వల్ల ఉద్యోగ, వ్యాపారాల్లో ఆటంకాలు తొలగుతాయని  పండితులు చెబుతున్నారు

కర్కాటక రాశి:  ఈ రాశి వారు అమ్మవారికి తెల్లని మిఠాయిలు, తామర పువ్వులు సమర్పించాలి. పాలతో చేసిన పదార్థాలను నైవేద్యంగా పెట్టాలి.  పూజకు.. నైవేద్యానికి  వెండి పాత్రలు ఉపయోగిస్తే చాలా  శుభప్రదమని పండితులు చెబుతున్నారు.

  సింహ రాశి: ఈ రాశి వారు  దీపావళి రోజు ( నవంబర్​ 8) లక్ష్మీదేవికి ఎర్రటి పువ్వులు సమర్పించి, బెల్లం లేదా గోధుమ పిండితో చేసిన మిఠాయిలను నైవేద్యంగా పెట్టాలి.ఇలా చేయడం వలన సమాజంలో  గౌరవం, కీర్తి, అభివృద్ధి చెందుతాయి.

కన్యా రాశి:  ఈ రాశి వారు పచ్చని యాలకులు, సువాసనగల పువ్వులను  లక్ష్మీ అమ్మవారికి సమర్పించాలి.  ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు  ఆర్థికంగా పురోగతి   ఉంటుంది.

 తులా రాశి: ఈ రాశి వారు దీపావళి రోజు ( నవంబర్​ 8)  తెల్లవారు జామున  అమ్మవారికి  తామర లేదా తెల్లని పువ్వులను సమర్పించాలి. ఖీర్ నైవేద్యంగా పెట్టి, ఇంటి పూజా మందిరంలో ఆవు నెయ్యి దీపం వెలిగించాలి.

వృశ్చిక రాశి:ఈ రాశి వారు దీపావళి రోజు లక్ష్మీదేవి పూజలో  ఎర్రటి పువ్వులు, బెల్లం అమ్మవారికి సమర్పించాలి. ముందుగా గణేశుడిని పూజించాలి. తరువాత హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి.

ధనుస్సు రాశి:దీపావళి రోజు ఈ రాశి వారు పసుపు రంగు పువ్వులు, పసుపు రంగు మిఠాయిలను లక్ష్మీదేవికి సమర్పించాలి. విష్ణు సహస్రనామం పఠించినా.. విన్నా సంపద, జ్ఞానం, అదృష్టం కలుగుతాయి

మకర రాశి: ఈ రాశి వారు  దీపావళి రోజు ఎరుపు, తెలుపు రంగు పువ్వులతో అమ్మవారిని పూజించాలి. పూజా మందిరంలో ఆవనూనెతో దీపం వెలిగించాలి.

కుంభ రాశి: ఈ రాశి వారు లక్ష్మీదేవికి నీలం లేదా తెలుపు రంగు పువ్వులు సమర్పించాలి. అనంతరం ధాన్యాలు, నల్ల నువ్వులను పేదలకు దానం చేయాలి,  ఈ రాశి వారికి ఏలినాటి శని చివరి దశలో ఉంది.  అందువలన కచ్చితంగా నల్ల నువ్వులు.. బెల్లం కలిపిన ఉండలను పేదలకు పంచిపెట్టండి

మీన రాశి: ఈ రాశి వారు దీపావళి రోజు పసుపు పువ్వులు, కుంకుమపువ్వు, పసుపు రంగు మిఠాయిలను అమ్మవారికి సమర్పించాలి. లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తిని కూడా భక్తితో పూజించాలి.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు పురాణాల ప్రకారం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.