డెమెుక్రాట్ల కంట్రోల్‌లోకి అమెరికా పాలిటిక్స్.. మిగతా 2 ఏళ్లు ట్రంప్ వీళ్ల మాట వినాల్సిందేనా?

డెమెుక్రాట్ల కంట్రోల్‌లోకి అమెరికా పాలిటిక్స్.. మిగతా 2 ఏళ్లు ట్రంప్ వీళ్ల మాట వినాల్సిందేనా?

అమెరికాలో జరిగిన 2026 మిడ్ టర్మ్ ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ సంచలన విజయం సాధించింది. ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్) తో పాటు సెనెట్‌లోనూ పట్టు సాధించి, కాంగ్రెస్‌పై పూర్తి నియంత్రణను సొంతం చేసుకుంది.

అధ్యక్షుడు ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా అమెరికా ఓటర్లు ఈ ఎన్నికల్లో బలమైన తీర్పునిచ్చారు. టెక్సాస్, అయోవా వంటి సాంప్రదాయ రిపబ్లికన్ కంచుకోటల్లో సైతం డెమొక్రాట్లు ఊహించని విజయాలు నమోదు చేసి మెజారిటీ స్థానాలను కైవసం చేసుకున్నారు.

ఈ ఘనవిజయంతో అధ్యక్షుడిగా ట్రంప్ చివరి రెండేళ్ల పదవీకాలంపై డెమొక్రాట్లు పూర్తి స్థాయి పర్యవేక్షణ సాధించారు. ట్రంప్ పాలనా విధానాలు, ప్రభుత్వ కాంట్రాక్టులు, ప్రముఖులపై విచారణలు చేపట్టేందుకు కొత్త కాంగ్రెస్ సన్నాహాలు చేస్తోంది.

►ALSO READ | ఎలాన్ మస్క్‌పై అమెరికా సెనేట్ విచారణ.. ఉక్రెయిన్ యుద్ధంలో స్టార్‌షీల్డ్ ట్యాంపరింగ్‌పై దర్యాప్తు!

ఎన్నికల ఫలితాలపై స్పందించిన ట్రంప్.. తాను బరిలో లేకపోవడం వల్లే పార్టీ ఓటమి చవిచూడాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఏదేమైనప్పటికీ ఈ పరిణామాలు అమెరికా రాజకీయాల్లో నూతన సమీకరణాలకు తెరలేపాయి.