రజనీకాంత్ అన్నయ్యకు తీవ్ర గాయాలు.. హుటాహుటిన బెంగళూరు చేరుకున్న తలైవా!

రజనీకాంత్ అన్నయ్యకు తీవ్ర గాయాలు.. హుటాహుటిన బెంగళూరు చేరుకున్న తలైవా!

సూపర్ స్టార్ రజనీకాంత్ సోదరుడు సత్యనారాయణ రావు గైక్వాడ్ కు త్రీవంగా గాయపడ్డారు.  నాలుగు రోజుల క్రితం ఇంట్లో మెట్ల మీద నుంచి జారిపడడంతో తలభాగానికి తీవ్రంగా దెబ్బతగిలింది. దీంతో బంధువులు ఆయనను బెంగళూరులోని రాష్ట్రోత్థాన ఆసుపత్రిలో చేర్పించారు. వెంటనే వైద్యులు సత్యనారాయణరావు తలకు శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. 

తన అన్నయ్య ఆరోగ్యం పరిస్థితిని తెలుసుకున్న రజనీకాంత్  హుటాహుటిన చెన్నై నుంచి బెంగళూరు చేరుకున్నారు. రాష్ట్రోత్థాన ఆసుపత్రిని సందర్శించి తన సోదరుడిని పరామర్శించారు. వైద్యులతో వ్యక్తిగతంగా మాట్లాడి తన సోదరుడి ప్రస్తుత ఆరోగ్య పరిస్థిని గురించి అడిగి తెలుసుకున్నారు.  వైద్యుల సలహా మేరకు సత్యనారాయణ రావు ప్రస్తుతం విశాంత్రి తీసుకుంటూ.. కోలుకుంటున్నారని రజనీ తెలిపారు. కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చి .. అన్నయ్య త్వరగా కోలుకుంటారని చెప్పారు. 

రజనీకాంత్ జీవితానికి, కెరీర్ కు తన అన్నయ్య సత్యనారాయణ రావు తోడుగా నిలిచారు.  ఎప్పుడైనా ఒక పెద్ద సినిమా విడుదలైనప్పుడు గానీ, తన ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు రజనీ బెంగళూరు వచ్చి తన అన్నయ్య ఆశీర్వాదం తీసుకోవడం అలవాటు. ఇప్పుడు వయసు సంబంధిత అనారోగ్యంతో పాటు ప్రమాదం జరగడంతో సూపర్ స్టార్ ఏమోషనల్ అయ్యారు. అన్నయ్య త్వరగా కోలుకుంటారని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. 

మరో వైపు తన అభిమాన నటుడు ఆసుప్రతికి చేరుకున్నారని తెలుసుకున్న ఫ్యాన్స్, స్థానికులు పెద్ద సంఖ్యలలో పోటెత్తారు. తన సోదరుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆందోళన చెందవద్దని రజనీ చెప్పారు.