లిస్బన్: పోర్చుగల్ లెజెండ్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో.. ఇంటర్నేషనల్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. ‘పోర్చుగల్ ప్రజలారా, మన జాతీయ జట్టుకు చెందిన నంబర్ 7 జెర్సీని తిరిగి ఇచ్చే సమయం వచ్చేసింది. ఈ జెర్సీ కేవలం నాది మాత్రమే అని నేనెప్పుడూ భావించలేదు. కానీ గత 23 ఏళ్లుగా దీనిని ధరించి ఆడే గొప్ప అవకాశం, బాధ్యత నాకు దక్కాయి. ఇప్పుడు దీన్ని నేను భవిష్యత్ తరాలకు అందించాల్సిన సమయం ఆసన్నమైంది.
ఇది అంత సులభమైన నిర్ణయం కాదు. ఎందుకంటే కొన్ని నిర్ణయాలు కేవలం మెదడుతో మాత్రమే కాకుండా హృదయంతో కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 2023లో ప్రారంభమై, నా జీవితాన్ని శాశ్వతంగా మార్చేసిన ప్రయాణం ముగిసింది’ అని 41 ఏళ్ల రొనాల్డో గురువారం సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన వీడియో సందేశంలో పేర్కొన్నాడు. కెరీర్‌లో ఆరు వరల్డ్ కప్స్ ఆడిన రొనాల్డో ఒక్కసారి కూడా టైటిల్ అందించలేకపోయాడు.
ఒక యూరోపియన్ టైటిల్‌తో పాటు కెరీర్‌లో 234 మ్యాచ్‌ల్లో 146 గోల్స్ చేశాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ చేసిన ఘనత అతనిదే కావడం విశేషం. సెప్టెంబర్ 24న నేషన్స్ లీగ్‌లో వేల్స్‌పై చివరి మ్యాచ్ ఆడిన రొనాల్డోను ఆ తర్వాత జరిగిన మ్యాచ్‌లో కోచ్ జార్జ్ జీసన్ ఆడించలేదు. దాంతో ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఫుట్‌బాల్ శిక్షణా శిబిరం నుంచి వైదొలిగాడు. తర్వాతి కొద్ది రోజులకే రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే రొనాల్డో తన క్లబ్ అల్‌నస్ర్ (సౌదీ అరేబియా) తరఫున ఫుట్‌బాల్‌ను కొనసాగించనున్నాడు. ఓవరాల్‌గా రొనాల్డో 985 గోల్స్ సాధించాడు.
