వరుణ్ సందేశ్ హీరోగా ఇనయ సుల్తానా, రేణు శ్రీ హీరోయిన్స్‌గా నటిస్తున్న చిత్రం ‘యద్భావం తద్భవతి’. రమేష్ జక్కల దర్శకత్వంలో ప్రసన్న లక్ష్మి భూమిరెడ్డి నిర్మిస్తున్నారు. నవంబర్ 27న సినిమా విడుదలకానుంది.
తాజాగా ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేసిన నిర్మాత లగడపాటి శ్రీధర్ టీజర్ చాలా బాగుందని మంచి కాన్సెప్ట్‌తో వస్తోన్న ఈ సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు. క్రైమ్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచుతుందని దర్శక నిర్మాతలు అన్నారు.
ALSO READ : తల్లి కూతుళ్ల చుట్టూ అతీంద్రియ శక్తులు.. భూమి పెడ్నేకర్ కొత్త సినిమా కథ ఇదే!
సుమన్, నాగ మహేష్, లోహిత్ కుమార్, ధనరాజ్, శ్వేత వర్మ, దయానంద్ రెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మిహిరామ్ సంగీతం అందిస్తున్నాడు.
