‘చందూ ఛాంపియన్’తో ఆకట్టుకున్న బాలీవుడ్ యువ హీరో కార్తీక్ ఆర్యన్, దర్శకుడు కబీర్ ఖాన్ కాంబినేషన్ రిపీట్ అవబోతోంది. తాజాగా ఈ ప్రాజెక్ట్‌ను అఫిషియల్‌గా అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి ‘లడాకూ’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. ఇక ఈ చిత్రంతో కార్తీక్ ఆర్యన్ నిర్మాతగా పరిచయం కాబోతున్నాడు.
డోపమైన్ స్టూడియోస్ అనే ప్రొడక్షన్ హౌజ్ స్టార్ట్ చేసిన కార్తీక్ ఆర్యన్.. బిర్లా స్టూడియోస్, కబీర్ ఖాన్ ఎంటర్‌టైన్మెంట్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది జూన్ 18న థియేటర్స్‌లో విడుదల చేయబోతున్నట్టు రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇచ్చారు.
రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. కభీర్ ఖాన్ గత చిత్రాలైన బజరంగీ భాయిజాన్, 83 చిత్రాల తరహాలో ఆశయం, పట్టుదల, నిరీక్షణ అనే అంశాల నేపథ్యంలో స్పూర్తిదాయకంగా ఈ సినిమా ఉండబోతోందని మేకర్స్ తెలియజేశారు.
Ananya Birla’s Birla Studios announces June 18th as the theatrical release date of Kartik Aaryan starrer Ladaku, directed by Kabir Khan! The National-award winning golden team of Kartik Aaryan and Kabir Khan have joined hands with Birla Studios for this heart-tugging, inspiring film titled ‘Ladaku’. Ladaku is produced by Birla Studios, Kabir Khan Entertainment and, also, marks the debut of Kartik Aaryan as a producer with Dopamine Studios. Ladaku narrates an extraordinary real-life story of ambition, grit and hope ❤️ See you at the movies!
— Applause Entertainment (@ApplauseSocial) November 4, 2026
