Nanna Kutti: ‘నాన్న కుట్టి’ నుంచి మరో బ్యూటిఫుల్ మెలోడీ.. వింటే ఫిదా అవ్వాల్సిందే!

Nanna Kutti: ‘నాన్న కుట్టి’ నుంచి మరో బ్యూటిఫుల్ మెలోడీ.. వింటే ఫిదా అవ్వాల్సిందే!

విజయ్ ఆంటోనీ లీడ్‌‌‌‌గా నటిస్తున్న తాజా  చిత్రం ‘నాన్న కుట్టి’.  ము.మారన్ దర్శకత్వంలో  మీరా విజయ్ ఆంటోని నిర్మిస్తున్నారు. రామాంజనేయులు జవ్వాజీ కో  ప్రొడ్యూసర్‌‌‌‌‌‌‌‌గా  వ్యవహరిస్తున్నారు. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్‌‌‌‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా నవంబర్ 20న విడుదల కానుంది.

తాజాగా ఈ చిత్రం నుంచి ఓ  మెలోడీ సాంగ్‌‌‌‌ను విడుదల చేశారు. ‘‘నాలోన నే లేను.. నీవై పోయాను లే.. నీ ప్రేమలో  నేను ఆ నింగి దాటాను లే..’ అంటూ సాగే పాట   వన్ సైడ్ లవ్‌‌‌‌లోని స్వీట్‌‌‌‌నెస్‌‌‌‌ను చూపిస్తోంది.  విజయ్ ఆంటోని సంగీతం, భాష్య శ్రీ  సాహిత్యం.. రుక్షర్ బంధుకియా గాత్రం ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

ఇందులో ప్రీతి ఆస్రాని సాంప్రదాయబద్ధంగా కనిపిస్తూ ఆకట్టుకుంది. లిథన్య, భగవతి పెరుమాళ్, హరిప్రియ ఇసై, అరువి మధన్, చిత్ర లక్ష్మణన్, శ్రీజ రవి, వెట్టై ముత్తుకుమార్, జెన్సన్ దివాకర్, మురుగానందం, మున్నార్ రమేష్, లిస్సీ ఆంటోని, కుమార్ నటరాజన్, విజయన్, ప్రవీణ, హరిత, హరిప్రియ ముఖ్య పాత్రల్ని పోషించారు. విజయ్ ఆంటోనీ సంగీతం అందించడంతో పాటు ఎడిటర్‌‌‌‌గా కూడా వ్యవహరించారు.