మెగా కుటుంబంలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్) త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలు కిరణ్మయితో ఆయన నిశ్చితార్థం (ఎంగేజ్‌మెంట్) నవంబర్ 5న హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, సినీ ప్రముఖుల సమక్షంలో కాబోయే దంపతులు ఉంగరాలు మార్చుకున్నారు. ముఖ్యంగా మెగా, అల్లు కుటుంబాలకు చెందిన ప్రముఖులంతా ఒకే చోట కనిపించడంతో అభిమానులు ఈ ఫొటోలను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.
రామ్ చరణ్ స్పెషల్ విషెస్.. ఫొటోలు వైరల్
సాయి దుర్గా తేజ్ నిశ్చితార్థంపై రామ్ చరణ్ సోషల్ మీడియాలో స్పందించారు. కాబోయే కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ ఎంగేజ్‌మెంట్ ఫొటోలను షేర్ చేశారు. “డియర్ తేజ్, కిరణ్.. మీ కొత్త జీవిత ప్రయాణం ఆనందంగా సాగాలి. మీ ఇద్దరి మధ్య ప్రేమ, అనుబంధం ఎప్పటికీ ఇలాగే ఉండాలి” అంటూ విషెస్ తెలిపారు. #KiranTejForever అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు. రామ్ చరణ్ షేర్ చేసిన ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెగా అభిమానులు కాబోయే జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Congratulations, dear @IamSaiDharamTej and #Kiran, on this beautiful new beginning ❤️ Wishing you both endless love, togetherness and a lifetime of happiness. So happy for both of you! #KiranTejForever https://t.co/eJ7g9I5S2X
— Ram Charan (@AlwaysRamCharan) November 5, 2026
మెగా, అల్లు ఫ్యామిలీ సందడి..
సాయి దుర్గా తేజ్ నిశ్చితార్థ వేడుకకు మెగా, అల్లు కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్, అల్లు అర్జున్, స్నేహారెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరితో పాటు నాగబాబు, వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, నిహారిక కొణిదెల, అల్లు అరవింద్, అల్లు శిరీష్ తదితర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పవన్ కల్యాణ్ పిల్లలు అకీరా నందన్, ఆద్య కూడా వేడుకలో సందడి చేశారు. ఇక సినీ పరిశ్రమ నుంచి మంచు మనోజ్, భూమా మౌనిక, నవదీప్, హర్ష చెముడు, దర్శకుడు వెంకీ కుడుముల తదితరులు హాజరై కాబోయే జంటకు శుభాకాంక్షలు తెలిపారు. దీంతో ఈ వేడుక మెగా, అల్లు కుటుంబాల కలయికతో సందడిగా మారింది.
కిరణ్ ఎవరు?
సాయి దుర్గా తేజ్ కాబోయే భార్య కిరణ్ గురించి తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. కిరణ్ ఆయనకు చిన్ననాటి స్నేహితురాలని, చాలాకాలంగా వీరిద్దరికీ పరిచయం ఉందని సమాచారం. ఈ స్నేహమే ప్రేమగా మారడంతో పెద్దల అంగీకారంతో పెళ్లికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే కిరణ్ కుటుంబ నేపథ్యం, చదువు, వృత్తికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
సాయి దుర్గా తేజ్ పెళ్లి ఎప్పుడు?
నవంబర్ 5న కిరణ్‌తో నిశ్చితార్థం చేసుకున్న సాయి దుర్గా తేజ్.. డిసెంబర్ 10, 2026న పెళ్లి చేసుకోనున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లో ఈ వివాహ వేడుక జరగనుందని తెలుస్తోంది. అయితే పెళ్లి వేదిక, ముహూర్త సమయం, అతిథుల వివరాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నిశ్చితార్థ వేడుకకు మెగా, అల్లు కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరుకావడంతో పెళ్లి వేడుక కూడా ఘనంగా జరిగే అవకాశం ఉంది. దీంతో సాయి దుర్గా తేజ్ పెళ్లి కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సినిమాలతోనూ బిజీగా సాయి దుర్గా తేజ్..
ఓవైపు పెళ్లి పనులతో బిజీ కానున్న సాయి దుర్గా తేజ్.. మరోవైపు తన సినిమాలపైనా దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఆయన మూడు ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
సంబరాల ఏటిగట్టు
రోహిత్ కేపీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా యాక్షన్ మూవీ ఇది. ఇందులో ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటిస్తున్నారు. జగపతిబాబు, శ్రీకాంత్, సాయికుమార్, అనన్య నాగళ్ల, ధనంజయ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా 2027 జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
SDT19 – తేజ కాకుమానుతో కొత్త సినిమా
సాయి దుర్గా తేజ్ మరో కొత్త ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అనిల్ సుంకర నిర్మాణంలో, సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ డైరెక్టర్ తేజ కాకుమాను దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది.. అయితే సినిమా టైటిల్, హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలను చిత్రబృందం ఇంకా వెల్లడించలేదు. అలాగే, ‘క’ సినిమాతో విజయాన్ని అందుకున్న సుజీత్, సందీప్ ల దర్శకత్వంలో సాయిదుర్గా తేజ్ మరో సినిమా చేస్తున్నారు. మొత్తానికి పెళ్లి సందడితో పాటు వరుస సినిమాలతోనూ సాయి దుర్గా తేజ్ బిజీగా ఉండబోతున్నారు.
Secrets of the Ages… Power beyond imagination. Stepping into something truly powerful… Excited to be part of this journey with the Dynamic directors @Dir_Sujith & @Dir_SandeepM and Passionate Producer @Sahugarapati7 anna #SDT19 #CosmicChronicles @Shine_Screens @VijayaDurgaProd
— Sai Dharam Tej (@IamSaiDharamTej) April 3, 2026
