- కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఆరోపణ
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు అమెరికా నుంచి, ఆ పార్టీ వ్యూహకర్త అశుతోష్ రంకాకు పాకిస్తానీ రాజకీయ నాయకుల నుంచి నిధులు వస్తున్నాయని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఆరోపించారు. విదేశీ ఎన్జీఓలు, శత్రు దేశాల నెట్వర్క్ల నుంచి స్వీకరించిన డబ్బుతోనే సీజేపీ నిరసనలు చేస్తూ దేశంలో అశాంతిని, గందరగోళాన్ని సృష్టించడానికి కుట్ర చేస్తున్నదని మండిపడ్డారు. గురువారం ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. దేశంలో నిరసనలు చేసేందుకు దీప్కే, అశుతోష్ రంకాకు విదేశాల నుంచి డబ్బు అందుతున్నదనడానికి ఆధారాలు అధికారుల వద్ద ఉన్నాయని జితేంద్ర సింగ్ చెప్పారు. విదేశీ నిధులను దేశంలో శాంతిభద్రతలకు భంగం కలిగించేందుకు సీజేపీ ఉపయోగిస్తోందని పేర్కొన్నారు. ఈ ఆరోపణలను సీజేపీ నేత సౌరవ్ దాస్ ఖండించారు. తమకు విదేశీ నిధులు వస్తున్నాయనే అనుమానం ఉంటే కేంద్ర నాయకులు తమతో ఎందుకు చర్చలు జరిపారని ప్రశ్నించారు.
