పాటియాల: సంగ్రూర్‌లో జరిగిన పంజాబ్ ఇన్సాఫ్ ర్యాలీ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డ్రగ్స్ బాధిత కుటుంబాలను కలిశారు. బటిండాకు చెందిన సుఖ్వీందర్ సింగ్ కల్కత్తా, గుర్మెల్ సింగ్ తూత్, ప్రకాష్ చంద్ కుటుంబ సభ్యుల గోడును శ్రద్ధగా విన్నారు.
న్యాయం కోసం వారు చేస్తున్న పోరాటంలో అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బరాలాలోని సేహ్నాలో సుఖ్వీందర్ సింగ్ కల్కత్తా కాల్పుల్లో చనిపోగా, తరణ్‌తరణ్‌లోని పట్టిలో కాంగ్రెస్ నేత, మాజీ సర్పంచ్ గుర్మెల్ సింగ్ తూత్ హత్యకు గురయ్యారు.
ఈ ఘటనలపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ కుటుంబాలు కోరాయి. వారి ఆందోళనలను సంబంధితవేదికలపై లేవనెత్తుతామని, న్యాయం జరిగేలా కృషి చేస్తామని రాహుల్, ఖర్గే వారికి హామీ ఇచ్చారు.
