టయోటా కిర్లోస్కర్ తన ఎంపీవీ ఇన్నోవా క్రిస్టాలో ఫ్లీట్ ఆపరేటర్ల కోసం ప్రత్యేకంగా లిమో వేరియంట్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. కేవలం జీఎక్స్ ఎస్ఎల్ఎఫ్ గ్రేడ్‌లో మాత్రమే లభించే ఈ మోడల్ 7 సీట్లు, 8 సీట్ల ఆప్షన్లలో అందుబాటులో ఉంది. దీని ఎక్స్‌షోరూమ్ ధరలు రూ.19.95 లక్షల నుంచి రూ.19.99 లక్షల వరకు నిర్ణయించారు.
7 సీట్ల మోడల్‌లో ప్రయాణికుల సౌకర్యం కోసం రెండవ వరుసలో ప్రత్యేకంగా కెప్టెన్ సీట్లను అమర్చారు. 2.4 లీటర్ ఫోర్-సిలిండర్ డీజిల్ ఇంజిన్‌తో మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తున్న ఈ కారు లీటర్‌కు 15 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుంది.
