గ్లోబల్ ఇన్వెస్టర్లకు రెడ్ కార్పెట్.. ఒక్కో అతిథికి ఒక్కో ఆఫీసర్.. ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే రిజిస్ట్రేషన్, పాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు

గ్లోబల్ ఇన్వెస్టర్లకు రెడ్ కార్పెట్.. ఒక్కో అతిథికి ఒక్కో ఆఫీసర్.. ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే రిజిస్ట్రేషన్, పాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు
  • ఇతర రాష్ట్రాల సీఎంలకూ ఆహ్వానాలు
  • ఒక్క హాలు నుంచి ఆరు ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోలకు 52 రంగాలపై సదస్సులు.. 136 స్టార్టప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు
  • ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026’  ఏర్పాట్లపై సమీక్షలో సీఎం రేవంత్

హైదరాబాద్, వెలుగు: పెట్టుబడులు, ఉపాధి కల్పనే లక్ష్యంగా నిర్వహిస్తున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026’కు ప్రపంచ స్థాయి ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. డిసెంబర్ 7 నుంచి 9వ తేదీ వరకు భారత్ ఫ్యూచర్ సిటీలోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ప్రాంగణంలో సమ్మిట్ జరగనుండగా, ఏర్పాట్లపై గురువారం సెక్రటేరియెట్​లో మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. 

గతేడాది నిర్వహించిన తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఒకే ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పో హాల్ ఉండగా, ఈసారి అంతర్జాతీయ ప్రమాణాలతో ఏకంగా ఆరు భారీ ప్రదర్శనశాలలు, నాలుగు ప్రధాన హాళ్లలో 52 రంగాలకు చెందిన ఎక్స్​పర్ట్స్, ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. 

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, గడ్డం వివేక్ సభ్యులుగా ఉన్న మంత్రివర్గ ఉపసంఘం..  ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించాలని సీఎం సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీఎం సలహాదారు రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్ పాల్గొన్నారు.

ప్రతి విభాగానికి ప్రత్యేక అధికారి..
సదస్సుకు వచ్చే జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విమానాశ్రయం నుంచే పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సమ్మిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు హాజరయ్యే ప్రతి ప్రతినిధికీ ఒక ప్రత్యేక లైజనింగ్ అధికారిని నియమించాలని, విమానాశ్రయానికి చేరుకోగానే రిజిస్ట్రేషన్ పూర్తి చేసి పాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు జారీ చేయాలని సూచించారు. ప్రతి విభాగానికి ప్రత్యేక అధికారితో పాటు ఒక సెక్యూరిటీ ఆఫీసర్​ను నియమించి కట్టుదిట్టమైన భద్రత కల్పించాలన్నారు.

ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు పెట్టుబడి ఒప్పందాలు, పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే కంపెనీల ప్రతినిధులకు ప్రత్యేక ఆహ్వానాలు అందించాలని సూచించారు. నవంబర్ 15 నాటికి సమ్మిట్ ఏర్పాట్లను పూర్తిచేసి ఫైనల్​ప్లాన్​తో రెడీగా ఉండాలని సీఎం డెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ విధించారు. సదస్సు నిర్వహణ కోసం 25 రంగాలవారీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్లను ఏర్పాటు చేయడంతో పాటు ఇప్పటికే 3,500 మందికి ఆహ్వానాలు పంపామని, వసతి, ప్రొటోకాల్, భద్రత పర్యవేక్షణకు పది అధికారుల కమిటీలు పనిచేస్తున్నాయని అధికారులు వివరించారు.

సమ్మిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో స్పెషల్ ​ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోలు
పెట్టుబడులు, ఆధునిక సాంకేతికత, ఉపాధి కల్పనే ధ్యేయంగా సమ్మిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో స్పెషల్​ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోలు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. ‘రక్షా ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పో’లో రక్షణ, ఏరోస్పేస్, అంతరిక్షం, సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్ పరికరాలతో పాటు వైమానిక విన్యాసాలు ప్రదర్శించనున్నామని, ఆహ్వానించిన 575 సంస్థల్లో ఇప్పటికే 49 సంస్థలు భాగస్వామ్యానికి ముందుకొచ్చాయని తెలిపారు. గేమింగ్, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఇండియా జాయ్–2026 నిర్వహించనున్నారు.

ప్రత్యేక స్టార్టప్ పెవిలియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 136 స్టార్టప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల ఆవిష్కరణలను ప్రదర్శించనుండగా.. వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, ప్రభుత్వ భూముల పరిరక్షణ, ప్రజా మౌలిక వసతుల సమస్యలకు సాంకేతిక పరిష్కారాల కోసం నవంబర్ 20 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగంలో 60 కంపెనీల ఎగ్జిబిషన్, అగ్రికల్చర్ పెవిలియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డ్రోన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ ప్రదర్శనలు ఉంటాయి.

తెలంగాణ సంస్కృతి, చేనేత, బతుకమ్మ, కాకతీయ శిల్పకళతో కూడిన తెలంగాణ పెవిలియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు పర్యాటక రంగ ప్రదర్శన, 'నర్సరీ నుంచి ఆక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్డ్ వరకు' విద్యారంగాన్ని ప్రతిబింబించేలా ఎడ్యుకేషన్ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పో ఉండాలని సీఎం దిశానిర్దేశం చేశారు.
 
8న తెలంగాణ క్లైమేట్ కాంక్లేవ్​
ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నినో ప్రభావంతో తలెత్తే తీవ్ర వాతావరణ మార్పులు, కరువు సవాళ్లను అధిగమించేందుకు డిసెంబర్ 8న ప్రత్యేకంగా ‘తెలంగాణ క్లైమేట్ కాంక్లేవ్’ నిర్వహించ నున్నారు. ఈ ప్రతిష్టాత్మక సదస్సులో దాదాపు 200 మంది అంతర్జా తీయ శాస్త్రవేత్తలు, రైతులు, పర్యావరణ నిపుణులు పాల్గొంటారని అధికారులు తెలిపారు. కరువును తట్టుకునే వినూత్న వ్యవసాయం, పశుసంరక్షణ, తాగునీటి భద్రత, అధిక ఉష్ణోగ్రతల నుంచి రక్షణ, అడవులు–జీవవైవిధ్య పరిరక్షణ, వ్యర్థాలను సంపదగా మార్చడం వంటి ఐదు ప్రధాన అంశాలపై ఇందులో విస్తృతంగా మేధో మథనం జరగనుంది.

ఇప్పటికే వాతావరణ మార్పుల వల్ల ఎదురవుతున్న తీవ్ర నష్టాలను గుర్తించి తక్షణ, దీర్ఘకాలిక పరిష్కారాలను కనుగొనాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. భవిష్యత్ తరాలను కరువు కాటకాల నుంచి రక్షించేందుకు, పర్యావరణ విపత్తులను దీటుగా ఎదుర్కొనేందుకు కార్యా చరణను రూపొందించే దిశగా ఈ క్లైమేట్ కాంక్లేవ్ నిర్ణయాత్మక పాత్ర పోషించాలని అధికారులను ఆదేశించారు.