జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలో విషాద ఘటన వెలుగుచూసింది. విద్యుత్ షాక్తో విభూది ఆద్య అనే 10 నెలల చిన్నారి మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదం నింపింది. ఇంటిలో ఆడుకుంటూ చార్జింగ్ పెట్టిన విద్యుత్ కాంటా (తూకం వేసే త్రాసు) ముట్టుకోవడంతో విద్యుత్ షాక్తో పాప చనిపోయింది. చిన్నారి కుటుంబం స్క్రాప్ షాప్ నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తూ ఉంటారు. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
పది నెలల నుంచి మూడేళ్ల వయస్సు వరకూ పిల్లలు ఇంట్లో కనిపించే ప్రతి వస్తువును ఆసక్తిగా తాకుతుంటారు. చేతికి అందిన వస్తువులను పట్టుకోవడం, నోట్లో పెట్టుకోవడం, వాటితో ఆడుకోవడం సహజం. ఈ వయస్సులో పిల్లలకు ప్రమాదాలపై అవగాహన ఉండదు. అందుకే వారి భద్రత పూర్తిగా పెద్దల బాధ్యత.
ఇంట్లో విద్యుత్ పరికరాలు, ఛార్జర్లు, ఎక్స్టెన్షన్ బోర్డులు, విద్యుత్ వైర్లు, వాటర్ హీటర్లు పిల్లలకు అందకుండా ఉంచాలి. మరీ ముఖ్యంగా.. వ్యాపార అవసరాల కోసం ఉపయోగించే ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలు, ఇతర పరికరాలను పిల్లలు ఆడుకునే ప్రదేశాల్లో పొరపాటున కూడా ఉంచకూడదు.
