ఎయిర్‌‌‌‌టెల్‌‌‌‌ లాభం 31 శాతం జంప్‌‌‌‌... రెండో క్వార్టర్లో రూ.8వేల 888 కోట్లు

ఎయిర్‌‌‌‌టెల్‌‌‌‌ లాభం 31 శాతం జంప్‌‌‌‌... రెండో క్వార్టర్లో రూ.8వేల 888 కోట్లు

హైదరాబాద్​, వెలుగు: టెలికాం రంగ ఆపరేటర్​ భారతి ఎయిర్‌‌‌‌టెల్‌‌‌‌ ఈ ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో ఆకట్టుకునే ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్​ ముగిసిన మూడు నెలల్లో కంపెనీ నికర లాభం గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 31 శాతం పెరిగి రూ.8,888 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే క్వార్టర్లో రూ.6,792 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. 

మొబైల్‌‌‌‌ సేవల ఆదాయం పెరగడం, వినియోగదారుల నుంచి వచ్చే సగటు ఆదాయం మెరుగుపడటం, హోమ్‌‌‌‌ బ్రాడ్‌‌‌‌బ్యాండ్‌‌‌‌ వ్యాపారం విస్తరించడం కంపెనీ పనితీరుకు ప్రధానంగా దోహదపడ్డాయి. కన్సాలిడేటెడ్‌‌‌‌ ఆదాయం 16.7 శాతం వృద్ధితో రూ.60,878 కోట్లకు చేరింది. అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే నాలుగు శాతం పెరిగింది.  

ఇబిటా 17.8 శాతం పెరిగి రూ.35,240 కోట్లకు చేరింది. ఈబీఐటీడీఏ మార్జిన్‌‌‌‌ 57.4 శాతంగా నమోదైంది. ఒక్కో వినియోగదారుడి నుంచి నెలకు వచ్చే సగటు ఆదాయం (ఏఆర్‌‌‌‌పీయూ) రూ.271కు పెరిగిందని ఎయిర్​టెల్​ స్టాక్​ ఎక్చేంజీ ఫైలింగ్​లో తెలిపింది.  

భారతీ హెక్సాకామ్ లాభం 34 శాతం అప్​

టెలికం సేవలు అందించే ఎయిర్​టెల్​ సబ్సిడరీ  భారతీ హెక్సాకామ్ కూడా సత్తా చాటింది. గత ఏడాదితో పోలిస్తే సంస్థ మొత్తం ఆదాయం 11.4 శాతం పెరిగి రూ.2,582 కోట్లకు చేరుకుంది. నికర లాభం 34.4 శాతం వృద్ధితో రూ.566 కోట్లుగా నమోదైంది. మొబైల్ సేవల విభాగంలో ఆదాయం 9.9 శాతం మేర వృద్ధి చెందింది. 

హోమ్స్, ఆఫీస్ తదితర సేవల ఆదాయం 49 శాతం పెరిగింది. వై-ఫై, ఐపీ టీవీ సేవలను విస్తరించడం వల్లే ఈ స్థాయిలో కస్టమర్లు పెరిగారు. ఏఆర్‌‌‌‌పీయూ రూ.251 నుంచి రూ.264కు పెరిగింది. గత ఏడాది కాలంలో కొత్తగా 12 లక్షల మంది స్మార్ట్‌‌‌‌ఫోన్ వినియోగదారులు నెట్‌‌‌‌వర్క్‌‌‌‌లో చేరారు.  కస్టమర్ల అనుభవాన్ని మెరుగుపరచడానికి గడిచిన ఏడాదిలో 411 కొత్త సెల్ టవర్లను ఏర్పాటు చేశారు.