ఆస్ప్రతిలో చేరిన పవార్ ..ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని మోదీ ఆరా

ఆస్ప్రతిలో చేరిన పవార్ ..ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని మోదీ ఆరా

ముంబై: ఎన్‌‌‌‌సీపీ (ఎస్‌‌‌‌పీ) అధినేత శరద్‌‌‌‌ పవార్‌‌‌‌ (85) ఆరోగ్యంపై మరోసారి ఆందోళన నెలకొంది. పుణెలోని రూబీ హాల్‌‌‌‌ క్లినిక్‌‌‌‌లో చికిత్స పొందిన ఆయన.. బుధవారం ఉదయం డిశ్చార్జ్‌‌‌‌ అయ్యారు. అయితే, కొన్ని గంటలు కూడా గడవకముందే తదుపరి వైద్య పరీక్షల కోసం ముంబైలోని బ్రీచ్‌‌‌‌ క్యాండీ ఆస్పత్రిలో చేరారు. 

ఈ విషయాన్ని ఆయన కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే వెల్లడించారు. ఈ నెల 2న దగ్గు, ఛాతీ నొప్పితో పుణెలోని ఆస్పత్రిలో చేరారు. చికిత్స అనంతరం ఇంటికి వెళ్లేందుకు సిద్ధమైన ఆయనను వైద్య పరీక్షల కోసం ముంబైకి తరలించారు. 

ఈ విషయం తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌‌‌‌ చేసి పవార్‌‌‌‌ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ప్రధాని చూపిన చొరవకు పవార్‌‌‌‌ కృతజ్ఞతలు తెలిపినట్లు ఆయన సహాయకుడు విఠల్‌‌‌‌ మణియార్‌‌‌‌ వెల్లడించారు. కాగా, సాధారణ పరీక్షల కోసమే  పవార్‌‌‌‌  ఆస్పత్రిలో చేరినట్లు రూబీ హాల్‌‌‌‌ క్లినిక్‌‌‌‌ ఓ ప్రకటనలో పేర్కొంది.