పాట్నా: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2026-27కు బీహార్ క్రికెట్ అసోసియేషన్ తమ జట్టును ప్రకటించింది. 17 మందితో కూడిన స్వ్కాడ్‌ను బీసీఏ సెలక్షన్ కమిటీ శుక్రవారం (నవంబర్ 6) అనౌన్స్ చేసింది. బీహార్‌కు చెందిన 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తొలి రెండు మ్యాచ్‌లకు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. తద్వారా సీనియర్ క్రికెట్‌లో తొలిసారిగా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడానికి వైభవ్ సిద్ధమయ్యాడు. సూరజ్ కశ్యప్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
కేవలం 15 ఏళ్ల వయస్సులోనే సీనియర్ క్రికెట్ జట్టుకు వైభవ్ కెప్టెన్‌గా ఎంపికావడం భారత దేశవాళీ క్రికెట్‌లో ఒక విశేషమైన మైలురాయి. వైభవ్‌ను కెప్టెన్‌గా నియమించడంపై బీసీఏ అధ్యక్షుడు హర్ష్ వర్ధన్ మాట్లాడుతూ.. కెప్టెన్సీ సూర్యవంశీకి నాయకుడిగా ఎదగడానికి ఒక అవకాశాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. వైభవ్ చిన్న వయసులోనే అపారమైన ప్రతిభ, ఆత్మవిశ్వాసం, పరిణితిని ప్రదర్శించాడని కొనియాడారు. అతని నాయకత్వంలో బీహార్ జట్టు మెరుగైన ప్రదర్శన కనబరుస్తోందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు.
నవంబర్ 14 నుంచి స్టార్ట్
2026-27 సీజన్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ నవంబర్ 14 నుంచి ప్రారంభం కానుంది. బీహార్ జట్టు గ్రూప్-బి లో ఉంది. ఈ గ్రూప్‌లో ఢిల్లీ, హర్యానా, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, రైల్వేస్, సౌరాష్ట్ర, తమిళనాడు వంటి బలమైన జట్లు ఉన్నాయి. ఇండోర్ వేదికగా సౌరాష్ట్రతో జరిగే మ్యాచ్‌తో ఈ టోర్నీలో బీహార్ తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది. బీహార్ ఆడే తొలి రెండు మ్యాచులకు వైభవ్ కెప్టెన్సీ చేయనున్నాడు. అనంతరం అతడు నవంబర్ చివరలో జరిగే రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ కోసం ఇండియాఎ జట్టులో చేరనున్నాడు.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీకి బీహార్ జట్టు ఇదే
వైభవ్ సూర్యవంశీ (కెప్టెన్), అలోక్ కుమార్, ఆయుష్ లోహరుక (వికె), అల్తమాష్ అష్రఫ్, పరమ కుమార్ సింగ్, అన్మోల్ కుమార్ (వికె), రిత్విక్ రాజ్, సూరజ్ కశ్యప్ (వైస్ కెప్టెన్), మయాంక్ కుమార్, రాఘవేంద్ర ప్రతాప్, ఆశిష్ కుమార్, వాసుదేవ్ ప్రతాప్ సింగ్, మహమ్మద్ ఖన్ద్ ఇజార్, ప్రమోద్ ఇజార్, ప్రమోద్ ఇజార్, సింగ్.
స్టాండ్‌బైస్:
బిపిన్ సౌరభ్, సుమన్ కుమార్, ఆకాష్ రాజ్, ఖలీద్ ఆలం, భాస్కర్ దూబే, కుమార్ రజనీష్, సుయాష్, అభిజీత్ సాకేత్, యశస్వి రిషబ్, లఖన్ రాజా, పవన్ కుమార్, అమిత్ చౌదరి, పీయూష్ సింగ్, భాను కుమార్, లోకేష్ బాబులాల్ కుమార్, ప్రశాంత్ శ్రీవాస్తవ.
