Virat Kohli vs Sachin: ప్రస్తుతం వన్డేల్లో సెంచరీల మీద సెంచరీలు బాదుతూ పూనకాలతో ఊగిపోతున్న టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ పేరు మీద ఉన్న 100 అంతర్జాతీయ శతకాల రికార్డును అందుకోవడం ఇక అసాధ్యమేనా? అంటే అవుననే అంటున్నారు భారత మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్. కింగ్త కోహ్లీ ప్రెసెంట్ సూపర్ ఫామ్‌లో ఉన్నా.. ఆ పాత రికార్డును బద్దలు కొట్టేంత మ్యాచ్‌లు అతడి ముందు లేవని తేల్చి చెప్పారు.
కోహ్లీకి అంత టైమ్ లేదు బ్రో: అభిషేక్
JioHotstar షో 'ఔట్ ఆర్ నాట్ ఔట్' వేదికగా మాజీ కోచ్ అభిషేక్ నాయర్ మాట్లాడుతూ.. కోహ్లీ 100 సెంచరీలు కొట్టాలనే ఆశ నాకూ కూడా ఉంది.. కానీ ఆ రికార్డు ఛేజ్ చేయడానికి మన దగ్గర తగినన్ని వన్డే మ్యాచ్‌లు ఉండాలి కదా!.. 2027 వన్డే వరల్డ్ కప్ తర్వాత కోహ్లీ రిటైర్ అవుతాడని అందరూ అనుకుంటున్నారు. ఆ తర్వాత కూడా ఆడతాడో లేదో చెప్పలేం.. ఒకవేళ ఆడినా అదే కసి, మోటివేషన్ ఉంటుందా అనేది క్వశ్చన్ మార్క్.. అందుకే ప్రపంచకప్ లోపు మిగిలిన 14 సెంచరీలు కొట్టడం ప్రాక్టికల్‌గా అంత ఈజీ అయితే కాదని అభిషేక్ అన్నాడు.
వన్డేల్లో విశ్వరూపం.. కానీ సచిన్ రికార్డుకి దూరం:
టెస్టులు, T20ఐలకు గుడ్ బై చెప్పేసిన విరాట్ కోహ్లీ.. ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మాట్ మీదనే ఫుల్ ఫోకస్ పెట్టాడు. 2025 జనవరి నుంచి కోహ్లీ ఆడుతున్న ఆట చూస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే. కేవలం 23 వన్డేల్లో 1,277 పరుగులు సాధించాడు. 67.21 సగటు, 106.77 స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 5 సెంచరీలు బాదేశాడు. అయినప్పటికీ, సచిన్ కొట్టిన 100 సెంచరీల మైలురాయిని అందుకోవాలంటే కోహ్లీ మరో 14 శతకాలు చేయాల్సిందే.
వరల్డ్ కప్ దాకా టీమిండియా షెడ్యూల్:
ప్రస్తుతం జరుగుతున్న న్యూజిలాండ్ సిరీస్ ముగిశాక, టీమిండియా రాబోయే రోజుల్లో పెద్దగా వన్డేలు ఆడే అవకాశం లేదు.. చేతిలో ఉన్న మ్యాచ్‌లు చాలా పరిమితంగా ఉండటంతో.. కింగ్ కోహ్లీ ప్రతీ మ్యాచ్‌లోనూ సెంచరీ కొడితే తప్ప సచిన్ 100 శతకాల రికార్డును అందుకోవడం కష్టమేనని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
* డిసెంబర్ 2026: శ్రీలంకతో 3 వన్డేల సిరీస్:
* జనవరి 2027: జింబాబ్వేతో 3 వన్డేలు
* జూన్-జులై 2027: 50 ఓవర్ల ఫార్మాట్లో ఆసియా కప్
* అక్టోబర్-నవంబర్ 2027: 2027 వన్డే వరల్డ్ కప్
సచిన్ vs కోహ్లీ: సెంచరీల లెక్కలు (Stats Table):
ఫార్మాట్ విరాట్ కోహ్లీ (మొత్తం: 86) సచిన్ టెండూల్కర్ (మొత్తం: 100)
వన్డేలు (ODIs) 55 (వరల్డ్ రికార్డ్) 49
టెస్టులు (Tests) 30 51
టీ20లు (T20Is) 1 0
