నల్లగొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రంపల్లి స్టేజి సమీపంలోని NH-65 జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళ్తున్న కారు అకస్మాత్తుగా సడన్ బ్రేక్ వేయడంతో వెనుక నుంచి వస్తున్న కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి.
ఈ ఘటనలో మొత్తం నాలుగు కార్లు ఢీకొని దెబ్బతిన్నాయి. అయితే అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. కార్లలో ప్రయాణిస్తున్న వారంతా క్షేమంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ALSO READ ; పంజాబ్‌లో రన్నింగ్ ట్రైన్లో చెలరేగిన మంటలు.. పట్టాలపై తగలబడ్డ ఐదు బోగీలు..!
ఈ ప్రమాదంలో చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ సర్పంచ్‌కు చెందిన కారు కూడా ఉన్నట్లు సమాచారం. వరుసగా నాలుగు కార్లు ఢీకొనడంతో వాహనాలు దెబ్బతిన్నాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
