సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే చూసిన అద్భుతాలు ఇప్పుడు రియాలిటీగా మారిపోతున్నాయి. స్పైడర్-మ్యాన్ చిత్రంలోని 'గ్రీన్ గోబ్లిన్' పాత్రను స్ఫూర్తిగా తీసుకుని.. చైనాకు చెందిన 26 ఏళ్ల యువ సాంగ్ జింగ్‌యు అనే కుర్రోడు నిజమైన ఫ్లయింగ్ హోవర్‌బోర్డ్‌ను తయారు చేశాడు. సినిమాల్లో కేవలం కల్పన అనుకున్న గాల్లో ప్రయాణించే టెక్నాలజీని ఆచరణ సాధ్యం చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు.
ఈ వినూత్న హోవర్‌బోర్డ్ పవర్ కోసం దాదాపు 10 ఎలక్ట్రిక్ మోటార్లను అమర్చారు. ఈ సరికొత్త DIY (Do-It-Yourself) ఆవిష్కరణ కేవలం ప్రయోగాలకే పరిమితం కాకుండా.. ఏకంగా పర్వతాల పైన, సువిశాలమైన యాంగ్జీ నదిపై గాల్లో ఎగిరి తన సత్తా చాటింది. ఎలాంటి రెక్కలు లేకుండా, మనిషి నిలబడి గాల్లో ప్రయాణించే ఈ విజువల్స్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతున్నాయి.
🤯 Science fiction is becoming reality! A 26-year-old Chinese creator, Song Xingyu, has built a real-life flying hoverboard inspired by Spider-Man’s Green Goblin. Powered by 10 electric motors, his DIY invention has flown over mountains and across the Yangtze River. The future we once watched in movies is taking off! 🚀 But this is still an experimental, high-risk flying device, not a consumer gadget.
— StarSnap 🌟 (@StarSnap_1) October 31, 2026
అయితే ఈ అద్భుతమైన ఆవిష్కరణ వెనుక భారీ రిస్క్ కూడా ఉంది. ఇది సాధారణ ప్రజలు కొనుగోలు చేసి వాడే కన్స్యూమర్ గ్యాడ్జెట్ కాదు. అత్యంత ప్రయోగాత్మకమైన, అధిక ప్రమాదంతో కూడిన ఫ్లయింగ్ డివైస్ ఇది. గాల్లో బ్యాలెన్స్ తప్పితే ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉన్నందున.. దీన్ని నడపడానికి ప్రత్యేక నైపుణ్యాలు అవసరం.
ఏదేమైనప్పటికీ సినిమా తెరపై మనం చూసిన ఎగిరే ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీలు ఇప్పుడు నిజ జీవితంలో సాకారమైపోతున్నాయి. ఈ టెక్నాలజీ భవిష్యత్తులో రవాణా రంగంలో ఎలాంటి విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతుందోనని టెక్ నిపుణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాంగ్ జింగ్‌యు చేసిన ఈ సాహసం టెక్కీలను, సైన్స్ ప్రేమికులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
