స్వీట్లు కాదు.. ఈ దీపావళికి మీ వాళ్లకు జీవితాంతం గుర్తుండిపోయేలా ఇచ్చే బెస్ట్ గిఫ్ట్స్! 

స్వీట్లు కాదు.. ఈ దీపావళికి మీ వాళ్లకు జీవితాంతం గుర్తుండిపోయేలా ఇచ్చే బెస్ట్ గిఫ్ట్స్! 

Unique Diwali Gifts: పండుగ సంబురం రెట్టింపు అవ్వాలంటే మనవాళ్లతో కలిసి జరుపుకోవాలి.. ఇల్లు, పిల్లలు, బంధుమిత్రులంతా ఒక చోట చేరితేనే అసలైన పండుగ వాతావరణం నెలకొంటుంది. ఈ పండుగ వేళ ఆత్మీయులతో ఊసులూడుకోవడమే కాకుండా, మన ప్రేమాభిమానాలకు గుర్తుగా బహుమతులు (Gifts) ఇచ్చిపుచ్చుకోవడం ఎంతో ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది. ఇక ఈ దీపావళికి మీ అయినవాళ్లకు ఇవ్వడానికి కొన్ని ప్రత్యేకమైన, యూనిక్ గిఫ్ట్ ఐడియాస్ మీకోసం.. 

హ్యాండ్‌లూమ్ వస్త్రాలు (Handloom Clothes): 

* దీపావళికి బంధుమిత్రులకు హ్యాండ్‌లూమ్ (నేత) దుస్తులను కానుకగా ఇస్తే చాలా యూనిక్‌గా ఉంటుంది.

* ప్రత్యేకత: ఇవి తొడుక్కుంటే ఒంటికి ఎంతో హాయిగా, సౌకర్యవంతంగా ఉంటాయి.

* సాంప్రదాయ లుక్: ట్రెడిషనల్ వేడుకలకు హ్యాండ్‌లూమ్ వస్త్రాలు ఇచ్చే రాయల్ అండ్ క్లాసీ లుక్ వేరే దేనికి రాదు.

లక్ష్మీ-గణపతి విగ్రహాలు (Lakshmi & Ganesha Idols): 

* దీపావళి పర్వదినాన శ్రీలక్ష్మీ దేవిని, విఘ్నేశ్వరుడిని పూజించడం అనవాయితీ.

* పూజా అలంకరణ: బంధువులు తమ ఇంట్లో పూజ చేసుకోవడానికి లేదా దేవుడి గదిని అలంకరించుకోవడానికి చిన్న సైజ్ లక్ష్మీదేవి, గణపతి విగ్రహాలను బహుమతిగా ఇవ్వొచ్చు.

* శుభసూచకం: ఈ విగ్రహాలను కానుకగా ఇవ్వడం వల్ల వాళ్ల ఇంట్లో శుభాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్ముతారు.

సీడ్ గ్రీటింగ్ కార్డ్స్ (Eco-friendly Seed Cards): 

* ప్రస్తుతం మార్కెట్‌లో పర్యావరణహితమైన ప్రత్యేకమైన సీడ్ కార్డ్స్ (Seed Paper Greeting Cards) అందుబాటులో ఉన్నాయి.

ALSO READ : తక్కువ ఖర్చుతో ఇంటికి ట్రెడిషనల్ లుక్.. ఈ ఐడియాలు ట్రై చేయండి!

* నేచర్ ఫ్రెండ్లీ: ఈ కార్డులపై శుభాకాంక్షలు తెలుపుతూనే, దీపాల కాంతులతో వేడుక పూర్తి చేసుకున్నాక.. ఈ కార్డును కుండీలో లేదా మట్టిలో పాతేసి నీళ్లు పోస్తే అందమైన మొక్క మొలుస్తుంది.

* గుర్తుండిపోయే కానుక: కార్డు పాతేసిన కొద్ది రోజులకే మొక్కగా ఎదుగుతుంటే.. మీ బహుమతి వాళ్ల మనసులో పచ్చగా, జీవితాంతం గుర్తుండిపోతుంది. ఈ దీపావళికి ఇలాంటి పర్యావరణహితమైన, సాంప్రదాయ బహుమతులతో మీ ఆత్మీయుల ఇళ్లలో వెలుగులు నింపండి.