నల్గొండ, వెలుగు : ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశానికి తృటిలో ప్రమాదం తప్పింది. గురువారం నియోజకవర్గంలో పర్యటిస్తుండగా, ఆయన వాహనం ప్రమాదానికి గురైంది. ప్రమాదం నుంచి ఆయన క్షేమంగా బయటపడడంతో పార్టీ నేతలు, ఆయన అనుచరులు ఊపిరి పీల్చుకున్నారు.
ఎమ్మెల్యే నకిరేకల్ నుంచి చిట్యాల మండలం చినకాపర్తికి వెళ్తుండగా, కట్టంగూరు మండలం అన్నారం స్టేజ్ దగ్గర నేషనల్ హైవేపై వెనుక నుంచి వచ్చిన మరో కారు బలంగా ఢీకొట్టింది. దాంతో వీరేశం కారు ముందు వెళ్తున్న ఎస్కార్ట్ వాహనాన్ని ఢీకొట్టి పాక్షికంగా ధ్వంసమైంది. కారులో ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో వీరేశంకు ఎలాంటి గాయాలు కాలేదు. సెక్యూరిటీ సిబ్బంది ఆయనను మరో కారులో తరలించారు.
