ఆధునిక జీవనానికి..సనాతన ధర్మ తాత్వికత అన్వయించుకోవాలి: ‘ది లాజిక్ ఆఫ్ అండ్’ పుస్తకావిష్కరణలో వక్తలు

ఆధునిక జీవనానికి..సనాతన ధర్మ తాత్వికత అన్వయించుకోవాలి: ‘ది లాజిక్ ఆఫ్ అండ్’ పుస్తకావిష్కరణలో వక్తలు

హైదరాబాద్, వెలుగు: యువత భారతీయ ఆధునిక జీవనానికి సనాతన ధర్మ తాత్వికత అన్వయించుకోవాల్సిన అవసరం ఉందని పలువరు వక్తలు పేర్కొన్నారు. గురువారం ప్రముఖ రచయిత ఆర్ శ్రీనివాసమూర్తి రచించిన ‘ది లాజిక్ ఆఫ్ అండ్ – సనాతన ధర్మ యాజ్ ఏ టూల్‌‌కిట్ ఫర్ ది కాంటెంపరరీ సీకర్’ పుస్తకావిష్కరణ జరిగింది.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సనాతన ధర్మం అంటే కేవలం ఆచారాలు, సంప్రదాయాలు, మతపరమైన క్రతువులు మాత్రమే కాదని, విస్తృతమైన తాత్విక ఆలోచనలు, జీవన విలువల సమాహారమన్నారు.

భారతీయ ప్రాచీన తాత్విక, సాంస్కృతిక సంప్రదాయాలను ఆధునిక జీవన విధానంతో అనుసంధానిస్తూ ఈ పుస్తకం రాసినట్లు ఉందన్నారు. వివిధ రంగాల ప్రముఖలు మహేశ్​ కుమార్ రాజు, రవీంద్ర కుమార్, సీతారాం సింగ్, శ్రీనివాసమూర్తి, విక్రమ్ కుమార్, విశేష్ గార్గ్, సన్నీ కుమార్ తదితరులు పాల్గొన్నారు.