పైసల కోసం రియల్టర్లకు కేటీఆర్ బెదిరింపులు: విప్ బల్మూరి వెంకట్ ఆరోపణలు

పైసల కోసం రియల్టర్లకు కేటీఆర్ బెదిరింపులు: విప్ బల్మూరి వెంకట్ ఆరోపణలు

హైదరాబాద్, వెలుగు: డబ్బుల కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బెదిరిస్తున్నారని విప్ బల్మూరి వెంకట్ ఆరోపించారు. కేటీఆర్ బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే తమ ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. గురువారం సీఎల్పీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

గతంలో మహబూబ్‌‌‌‌నగర్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోనూ, వరంగల్ రైతు గర్జన సభ సందర్భంగానూ ఎస్‌‌‌‌ఏఎస్‌‌‌‌ కన్‌‌‌‌స్ట్రక్షన్ కంపెనీ యజమాని జీవీ రావును పైసల కోసం బెదిరించారన్నారు. తాను చేస్తున్న ప్రతి ఆరోపణకు పక్కా ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఇవి తప్పు అని ఖండించే దమ్ము కేటీఆర్‌‌‌‌కు ఉందా? అని సవాల్ విసిరారు.

రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీజేపీ, బీఆర్ఎస్ లోపాయికారీ ఒప్పందంతో పనిచేస్తున్నాయని విమర్శించారు. కేటీఆర్ ఇప్పటికైనా తన బ్లాక్‌‌‌‌మెయిలింగ్ బుద్ధిని మార్చుకోకపోతే తెలంగాణ సమాజం ముందు దోషిగా నిలబడాల్సి వస్తుందని హెచ్చరించారు.