పచ్చి గుడ్లతో తయారు చేసే మయోనైజ్‌‌‌‌పై మరో ఏడాది నిషేధం

పచ్చి గుడ్లతో తయారు చేసే మయోనైజ్‌‌‌‌పై మరో ఏడాది నిషేధం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పచ్చి గుడ్లతో (రా-ఎగ్స్) తయారు చేసే మయోనైజ్‌‌‌‌పై ఉన్న నిషేధాన్ని ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగించింది. దీని ఉత్పత్తి, నిల్వ, విక్రయాలపై పూర్తిస్థాయిలో నిషేధం విధిస్తూ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రజారోగ్యం, వినియోగదారుల రక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆహార భద్రతా విభాగం స్పష్టం చేసింది. ఈ నిషేధ ఉత్తర్వులు 2026 అక్టోబర్ 30 నుంచి తక్షణమే అమలులోకి వచ్చాయని, 2027 అక్టోబర్ 29 వరకు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. 

రాష్ట్రంలోని అన్ని హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌‌‌‌ఫుడ్ సెంటర్లు, స్ట్రీట్ వెండర్లు ఈ నిబంధనలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. ఈ నిర్ణయాన్ని ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.