అదానీ పోర్ట్స్ చేతికి యూరప్ కంపెనీ... రూ.26 వేల కోట్లతో ఎవోస్‌‌‌‌ కొనుగోలు 

అదానీ పోర్ట్స్ చేతికి యూరప్ కంపెనీ... రూ.26 వేల కోట్లతో ఎవోస్‌‌‌‌ కొనుగోలు 

న్యూఢిల్లీ: అదానీ పోర్ట్స్‌‌‌‌ అండ్‌‌‌‌ స్పెషల్‌‌‌‌ ఎకనామిక్‌‌‌‌ జోన్‌‌‌‌ (ఏపీఎస్‌‌‌‌ఈజెడ్‌‌‌‌) యూరప్‌‌‌‌లో భారీ కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. నెదర్లాండ్స్‌‌‌‌కు చెందిన ద్రవ ఇంధన నిల్వల సంస్థ ఎవోస్‌‌‌‌ బీవీని 2.56 బిలియన్‌‌‌‌ యూరోల (సుమారు రూ.26 వేల కోట్లు) విలువకు కొనుగోలు చేయనుంది. ఇందులో ఈక్విటీ విలువ 1.18 బిలియన్‌‌‌‌ యూరోలు. 

ఇగ్నియో ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్స్‌‌‌‌ నుంచి 100 శాతం వాటాను సొంతం చేసుకోనుంది. ఈ ఒప్పందంతో నెదర్లాండ్స్‌‌‌‌, జర్మనీ, స్పెయిన్‌‌‌‌, బెల్జియం, మాల్టాలోని 8 టెర్మినళ్లు అదానీ పోర్ట్స్‌‌‌‌ పరిధిలోకి వస్తాయి. ఎవోస్‌‌‌‌కు 63 లక్షల క్యూబిక్‌‌‌‌ మీటర్ల నిల్వ సామర్థ్యం ఉంది. 

2025లో 3.7 కోట్ల టన్నుల సరకు నిర్వహించి, 39.2 కోట్ల యూరోల ఆదాయం, 21.9 కోట్ల యూరోల ఈబీఐటీడీఏ నమోదు చేసింది. ఇబిటా మార్జిన్‌‌‌‌ 56 శాతంగా ఉంది. కొనుగోలు పూర్తయితే 10 దేశాల్లో అదానీ పోర్ట్స్‌‌‌‌ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ 28 పోర్టులు, టెర్మినళ్లకు విస్తరిస్తుంది. రుణాల ద్వారా నిధులు సమకూర్చనున్న ఈ ఒప్పందానికి నియంత్రణ సంస్థల అనుమతులు రావాల్సి ఉంది. 2031 నాటికి 100 కోట్ల టన్నుల సరకు నిర్వహించాలన్న లక్ష్యానికి ఈ కొనుగోలు కీలకం అవుతుందని ఏపీఎస్‌‌‌‌ఈజెడ్‌‌‌‌ తెలిపింది.